ఎస్ఎస్ రాజమౌళి ఇంటికి పూరీ జగన్నాథ్.. ఇకపై ఆయన బాటలోనే పయనం

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం మళ్లీ కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్న పూరీ జగన్నాథ్ తదుపరి చిత్రంతో సాలిడ్ హిట్ అందుకోవాలని ప్రత్నిస్తున్నారు. తన నెక్ట్స్ సినిమాను పూరీ జగన్నాథ్ తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో కలిసి తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి పూరీ జగన్నాథ్ కాస్తా తన రూటును మార్చుకున్నారు. పక్కా ప్లానింగ్ తో రంగంలోకి దిగుతున్నారు. అందుకు నిదర్శనమే పూరీ జగన్నాథ్ తాజాగా తీసుకున్న నిర్ణయమే..

వరుస పరాజయాల నడుమ పూరి కీలక నిర్ణయం..
గెలుపోటములను దర్శకుడు పూరీ జగన్నాథ్ ఎప్పుడూ సీరియస్ గా చూడరు. ప్రతి అంశాన్ని సవాల్ గా తీసుకుంటారు. నాట్ పర్మినెంట్ అనే మోటోతో ఉంటారు. అయితే పూరీ జగన్నాథ్ ఎంతో ప్రాక్టికల్ గా ఉన్నప్పటికీ తన సినిమాల విషయంలో అంచనాలను తప్పుతున్నారు. వరుసగా పరాజయాలను అందుకుంటున్నారు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు చివరిగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చి భారీ పరాజయాన్ని అందుకున్నాయి. అయితే లైగర్ చిత్రం పరాజయం అయిన సందర్భంగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ బాటలో పయనించబోతున్నారు.

Director Puri Jagannadh went to SS Rajamouli House and met vijayendra Prasad

ఎస్ఎస్ రాజమౌళి ఇంటికి పూరీ, ఛార్మి..
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, పూరీ కనెక్ట్స్ సంస్థ పార్ట్ నర్ ఛార్మీ కౌర్ ఇద్దరు తాజాగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇంటికి వెళ్లారు. అక్కడ డైరెక్టర్ రాజమౌళి వాళ్ల తండ్రి, స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ను కలిశారు. కలిసి తను చేయబోయే నెక్ట్స్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్స్ విషయంలో పలు సలహాలు, సూచనలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు విజయేంద్ర ప్రసాద్ తో కలిసి ఉన్న ఫొటోను తాజాగా పూరీ కనెక్ట్స్ ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. విజయేంద్ర ప్రసాద్ ఆలోచనా ధోరణి, సరళత, స్పష్టత తనలో స్ఫూర్తిని నింపాయని పూరీ జగన్నాథ్ తెలిపారు.

విజయేంద్ర ప్రసాద్ సూచన మేరకే..
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విజేంద్ర ప్రసాద్ రైటర్ గా చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన ఎన్నో సినిమాలకు కథను అందించారు. ఎస్ఎస్ రాజమౌళి చిత్రీకరించే ప్రతి సినిమాకు విజయేంద్ర ప్రసాదే కథను అందిస్తారనేది తెలిసిందే. అంతటి పేరున్న విజయేంద్ర ప్రసాదే పూరీ జగన్నాథ్ ఫొటోను తన మొబైల్ వాల్ పేపర్ గా పెట్టుకోవడం ఇండస్ట్రీలో ఇప్పటికీ అందరినీ ఆశ్చర్య పరిచే విషయం. అయితే పూరీ జగన్నాథ్ అంటే తనకు ఎంతో ఇష్టమని విజయేంద్ర ప్రసాద్ ఎన్నో మార్లు చెప్పారు. ఇక పూరీ వరుసగా డిజాస్టర్లు అందుకుంటూ ఉంటుంటే ఓ సారి పూరీకి ఇంటర్వ్యూ ద్వారా సలహా, సూచనలు చేశారు.

తను నెక్ట్స్ తీయబోయే సినిమా కథను ఒక్కసారి తనకు వినిపించినా, వివరించినా తనకున్న అనుభవాన్ని పంచుకుంటానని ఓపెన్ గా చెప్పారు. తను ఎంతగానో అభిమానించే పూరీ జగన్నాథ్ ఫ్లాప్ సినిమాలు తీస్తుంటే అస్సలు నచ్చడం లేదని, నెక్ట్స్ సినిమా కథను తనకు వినిపించమని విజయేంద్ర ప్రసాద్ నేరుగా పూరీ జగన్నాథ్ తోనే చెప్పారు. దాంతోనే తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో తీయబోయే సినిమా కథను విజయేంద్ర ప్రసాద్ కు వినిపించినట్టు తెలుస్తోంది. ఇక పూరీ - విజయ్ సేతుపతి కాంబోలోని సినిమాకు టబు, రాధికా ఆప్టే లు హీరోయిన్లుగా ఫైనల్ అయ్యారు. పూరీ కనెక్ట్స్ పై సినిమా రూపుదిద్దుకోనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X