వాడుకుంటే వాడుకో.. ఆడుకుంటే ఆడుకో.. స్టార్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్!
Puri Jagannadh: టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఎంతోమంది హీరోలను స్టార్ హీరోలుగా మార్చాడు. అదే సమయంలో ఎన్నో వైఫల్యాలను ఎదుర్కొన్నారు. అయినా.. అధైర్యపడకుండా .. హిట్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా తనదైన స్టైల్ లో సినిమాలు తీస్తున్నారు. అలాగే..పూరి జగన్నాథ్ తన అభిప్రాయాలు, ఆలోచనలను 'పూరి మ్యూజింగ్స్' (Puri Musings) అనే పోడ్ కాస్ట్ ద్వారా పంచుకుంటున్నారు. తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై కామెంట్స్ ఓ ఇంట్రెస్టింగ్ పోడ్ కాస్ట్ విడుదల చేశారు.
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన పాడ్ కాస్ట్ లో.. బాలరాజు అనే భక్తుడికి దేవుడికి మధ్య జరిగిన సంభాషణను పంచుకున్నారు. కథలో బాలరాజు కష్టాలు తట్టుకోలేక కఠోర తపస్సు చేశాడు. దీంతో దేవుడు ప్రత్యక్షమై ఏంటి అని బాలరాజు వంక చూశాడు. దీంతో బాలరాజు మాట్లాడుతూ.. స్వామి ఖర్చులు ఎక్కువయ్యాయి. కోట్లు కావాలి. కాస్త మీ దగ్గర ఏదైనా క్యాష్ ఉంటే. నా అకౌంట్ లో డిపాజిట్ చేయగలరా ? అని దేవుడ్ని అడిగారు. దీంతో 'నా దగ్గర క్యాష్ ఉండదు నాయనా.. పైగా బ్యాంక్ అకౌంట్ కూడా లేద'ని సమాధానమిచ్చాడు దేవుడు. దీంతో బాలరాజు బంగారం, డైమండ్స్ వంటివి లేవా స్వామి? అని అడిగాడు.

'నీకు ఇస్తే అందరూ అడుగుతారమ్మా.. అందుకే నేను నా దగ్గర పెట్టుకోవడం లేదు 'అంటూ దేవుడు సమాధానం ఇచ్చాడు. 'అయితే నాకు ఆనందాన్ని ప్రసాదించు' అంటూ బాలరాజు దేవుని అడిగాడు. 'హ్యాపీనెస్ అనేది స్టేట్ ఆఫ్ మైండ్ బంగారం. రోజు లేని దాని గురించి ఏడుస్తుంటే ఎక్కడినుండి వస్తది హ్యపీనెస్ బంగారం'అని దేవుడు అన్నాడు. 'అయితే నా జీవితంలో కష్టాలు అనేవి తీసేయండి' అంటూ బాలరాజు కోరాడు.
'అవి తీసేస్తే ఎలా? కష్టాలు తర్వాతనే కదా సుఖాలు వచ్చేవి. అవే వద్దంటే ఎలా? కష్టం తర్వాతనే కదా సుఖం వచ్చేది?' అంటూ దేవుడు సమాధానం ఇచ్చాడు. 'అయితే.. నాకు తాగుడు అలవాటు ఎక్కువైంది. ఆ తాగుడు మాన్పించేందుకు ఏదైనా చేయగలరా? అని బాలరాజు అడిగారు.దీంతో 'అరేయ్.. తాగుడు మొదలుపెట్టింది నువ్వు అనగానే.. ' అయితే స్వామి ఈ మధ్య అందరి మీద అరుస్తున్నాను.కాస్త సహనాన్ని అయినా ప్రసాదించండి' అని బాలరాజు కోరుతాడు.
'అది నేను ఇవ్వాల్సిన పనిలేదు నాయనా.. కష్టాలు పడి.. పడి.. నీకే అలవాటు అవుతోంది ఆటోమేటిగ్గా నీకు సహనం వచ్చేస్తుంది. దాని గురించి ఎక్కువగా ఆలోచించకు' అని దేవుడు సమాధానమిచ్చాడు. 'అయితే నాకు జ్ఞానాన్ని ప్రసాదించి బుద్ధుల్లాగా మార్చేయండి స్వామి' అంటూ బాలరాజు కోరాడు దేవుడు. 'బుద్ధుడికి నేను ఎలాంటి జ్ఞానం ఇవ్వలేదు. ఆయనే 49 రోజులు మెడిటేషన్ చేసి జ్ఞానం సంపాదించుకున్నాడు. నువ్వు కూడా ట్రై చెయ్ .. అది పెద్ద పని కాదు. అని దేవుడు సమాధానమిస్తాడు.

'పోనీలే స్వామి.. ఈ కొత్త సంవత్సరంలోనైనా నా జీవితం మారుతుందా? అరేయ్ ప్రతిరోజు అందంగా, ఆనందంగా గడుపుతూ సెలబ్రేట్ చేసుకోమని, ప్రతి రోజు చెప్పుతుంటే.. ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకొని, జీవితం మారుతుందంటే? ఎలా ఆ సమాధానంతో బాలరాజు అయోమయంలో పడ్డాడు. 'మరి ఏం అడగాలి? ఏం అడిగినా.. ఏమి తిక్క తిక్క సమాధానాలు చెబుతున్నావు? అసలు నిన్ను ఎందుకు మొక్కాలి' అని దేవునిపై బాలరాజు అరుస్తాడు.
దీంతో దేవుని కూడా కోపం వస్తుంది. 'ఎవర్రా నిన్ను మొక్కమన్నది. నాకోసం ఇంత పెద్ద తపస్సు చేశావు? ఆ తపస్సు ఏదో నీకోసం నువ్వు చేసుకోవచ్చు కదా.. అన్నీ నేనే ఇస్తే నువ్వెందుకు రా బేవకూఫ్.. చేతకాకపోతే అన్ని బ్యాకప్ చెప్పి పైకి వచ్చేసేయ్..'అని దేవుడు సమాధానం ఇస్తాడు. దీంతో బాలరాజు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అప్పుడు దేవుడు మళ్లీ మాట్లాడుతూ.. నాన్న బంగారం నీకు అన్ని ఇచ్చాను. ఇప్పుడు ఇంకో కొత్త సంవత్సరం కూడా ఇస్తున్నాను. వాడుకుంటే వాడుకో.. ఆడుకుంటే ఆడుకో.. తాగుతావో తందనాలాడుతావో.. నీ ఇష్టం ప్రతిదానికి నన్ను మాత్రం పిలవకు హ్యాపీ న్యూ ఇయర్' అంటూ దేవుడు మాయమైపోయాడు.
ప్రస్తుతం డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు వేలాదిమంది ఫ్యాన్స్ దీని వీక్షించి తమకు నచ్చిన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు లైక్స్, షేర్ చేస్తున్నారు. పూరీ జగన్నాథ్ కు 2025లోనైనా భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కాలని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











