Puri Jagannadh: ఇంట్లో వారే డేంజర్ క్రిమినల్స్.. అలాంటోళ్లే అత్యాచారాలకు పాల్పడుతారు..

Puri Jagannadh: టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు. ఎంతోమంది హీరోలను స్టార్ హీరోలుగా మార్చాడు. అదే సమయంలో ఎన్నో వైఫల్యాలను కూడా ఎదుర్కొన్నాడు. అయినా.. హిట్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా తనదైన స్టైల్ లో సినిమాలు తీస్తూ.. మూవీ లవర్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాడు. అలాగే.. పూరి తన అభిప్రాయాలు, ఆలోచనలను 'పూరి మ్యూజింగ్స్‌' (Puri Musings) అనే పోడ్ కాస్ట్ ద్వారా పంచుకుంటున్నారు. నేడు ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ అంటూ ఓ ఇంట్రెస్టింగ్ పోడ్ కాస్ట్ విడుదల చేశారు.

డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన 'పూరి మ్యూజింగ్స్‌'(Puri Musings) పోడ్ కాస్ట్ లో మాట్లాడుతూ..' బ్లాక్ మెయిల్ కంటే చాలా ప్రమాదకరమైంది ఎమోషనల్ బ్లాక్ మెయిల్. మనకు తెలియని వారు బ్లాక్ మెయిల్ చేస్తారు. కానీ, మనల్నీ బాగా ప్రేమించే వాళ్లు, మనం ఎక్కువగా గౌరవిస్తావో వాళ్లే తమని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారు.ముఖ్యంగా అమ్మ, నాన్న, ఇంట్లో ఉన్న పెద్ద వాళ్లు ఎక్కువగా దీనికి పాల్పడుతుంటారు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Director Puri Jagannath shares interesting facts about emotional blackmail in his podcast Puri Musings

'వాళ్లకి ఇష్టమైన చదువు నుంచి మొదలవుతుంది. ఆ తర్వాత మీకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకోమని, పెళ్లి తర్వాత పిల్లలను కనమని, నీ కోసం ఇది చేశాం.. అది చేశాం. మనల్ని కంట్రోల్ చేశారు. వాళ్ళు అనుకున్నది జరగాలి. అంతే తప్ప నీ ఇష్టం ఏంటని ఎప్పుడు అడగరు. వాళ్ళ ఇష్ట ప్రకారమే నడవాలి.. నడుచుకోవాలి. వారు అనుకున్నది సాధించుకోవడం కోసం అలుగుతారు. ఏడుస్తారు. మీతో మాట్లాడటం మానేస్తారు ఇలా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు' అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు పూరి జగన్నాథ్.

'ఇలాంటి ఎమోషనల్ బ్లాక్ మెయిల్స్ వల్ల మీరు నిద్రలేని రాత్రులు గడుపుతారు. కంగారుకు గురవుతారు. ఈ ప్రాబ్లమ్స్ ని ఎవరితో చెప్పుకోలేరు. మీలో మీరే మథనపడుతూ బతుకుతారు. గుర్తుపెట్టుకోండి.. మన ఇంట్లో వాళ్ళు అమాయకంగా కనిపించే క్రిమినల్స్.. ఎవరి స్వార్థం వారిది. వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ల స్వార్థం కోసం ఏమోమో అడుగుతుంటారు. ఆ విషయాలను ఒక సారి విన్నారో మీ సరదా తీరిపోతుంది. ఎవరైనా మిమ్మల్నీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారో వారి పక్కన పెట్టండి.
మిగతావన్నీ వినండి. కానీ, మీరు ఇబ్బంది పడే ఏ పనిని చేయొద్దు' అని హెచ్చరించారు.

Director Puri Jagannath shares interesting facts about emotional blackmail in his podcast Puri Musings

పూరి ఇంకా మాట్లాడుతూ..' వాళ్ళు డ్రామాలు చేస్తే .. అంతకంటే ఎక్కువ డ్రామా చేయండి. ఇల్లు వదిలి కనిపించకుండా పోతానని చెప్పండి. దెబ్బకి దెబ్బ కొట్టకపోతే.. మీరు ఇరుక్కుంటారు. వారు ఎలాంటి డైలాగులు వాడితే అలాంటి డైలాగులు మీరు కూడా వాడండి. నెల రోజుల తర్వాత అడగబోయే కోరికల కోసం ఇప్పటినుండి మీ మీద ఎంతో ప్రేమ కురిపిస్తారు. మీరు జాగ్రత్తగా ఉంటే తప్ప ఇలాంటి సింటమ్స్ గుర్తించలేరు' ముందు జాగ్రత్తలు చెప్పారు.

'అమ్మ, చెల్లి, నాన్న, మామయ్య, పిన్ని, లైఫ్ పార్ట్నర్ ఎవరైనా కావొచ్చు. అస్సలు లెక్క చేయొద్దు. ఎవరైతే ఇంట్లో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో.. ఎవరైతే కుటుంబాన్ని ప్రేమిస్తారో.. అలాంటి వారిపై ఇలాంటి అత్యాచారాలు జరుగుతాయి. నువ్వు తప్ప నాకు ఎవరున్నారుంటూ కన్నీరు పెట్టుకుంటారు. వారు అనుకున్నది సాధించడం కోసం ఎన్నో డ్రామాలు వాడుతారు . ఆ డ్రామాలో మాత్రం అస్సలు పడొద్దు. బీ కేర్ పుల్ అంటూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు పూరి జగన్నాథ్.

More from Filmibeat

Read more about: puri jagannadh puri musings
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X