Vyooham Shapadham Trailer: ఆర్జీవీ వ్యూహం, శపథం ట్రైలర్ ఆగయా.. ఏపీ రాజకీయాల్లో అలజడేనా?
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో శివ వంటి ట్రెండ్ సెట్ చేసే సినిమాలు తెరకెక్కించిన ఈయన ఈ మధ్య కాలంలో మాత్రం వరుసగా కాంట్రవర్శీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన చర్చ సాగేలా చేస్తున్నాడు.
రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ పొలిటికల్ మూవీనే 'వ్యూహం'. ఈ సినిమాకు నెక్స్ట్ పార్ట్ యే వ్యూహం శపథం. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను సైలెంట్ గా విడుదల చేసి షాక్ ఇచ్చారు ఆర్జీవీ. ఆ ట్రైలర్ ఎలా ఉంది.. దేని గురింటి ఎక్కువగా హైలెట్ చేశారనే విషయాల గురించి మనం ఈ ట్రైలర్ లో తెలుసుకుందాం.

వ్యూహం శపథం' చిత్రాల్లో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్, భారతీ రెడ్డి పాత్రలో మానసలు నటించారు. ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. అయితే వ్యూహం సినిమాను ఈనెల 23వ తేదీ విడుదల చేస్తుండగా.. ఆ తర్వాత వారం రోజులకే పార్ట్ 2 అయిన వ్యూహం శపథం సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే మరో ట్రైలర్ ను విడుదల చేశారు చిత్ర బృందం.
మార్చి ఒకటవ తేదీన ఈ వ్యూహం, శపథం సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన ఆర్జీవీ ట్రైలర్ ను కూడా యాడ్ చేశారు. ముందగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలిచినట్లుగా చూపించగా.. చంద్రబాబు వద్ద ఎవరో మాట్లాడుతూ.. మరో పదేళ్లు మనం ఆయన నీడను కూడా టచ్ చేయలేం అంటూ చెప్పే మాటలతో ట్రైలర్ ను ప్రారంభించారు. లోకేష్ యే ఈ పార్టీని నడపాలన్న పట్టుదలతో మీరు ఈ పార్టీని నాశనం చేస్తున్నారంటూ చెప్పే డైలాగ్స్ కూడా కాంట్రవర్సీగా ఉన్నాయి.
VI Anand: అల్లు అర్జున్‌తో ఊరుపేరు భైరవకోన డైరెక్టర్ కొత్త సినిమా.. ఎలాంటి కథ అంటే?
ఆ తర్వాత పవన్ కల్యాణ్ ను చూపించారు. జగన్ ను కిందకు లాగడానికి పవన్ కల్యాణ్ ను వాడుకోవాలని చూస్తున్నట్లు చంద్రబాబు చెప్పడం చూపించారు. ఆ తర్వాత పాము, మొసళ్లతో పాటు చాలా డేంజరస్ వ్యక్తి చంద్రబాబు అంటూ జగన్ చెబుతూ కనిపిస్తారు. తొక్కిసలాట గురించి ముందే తెలిసిన కావాలనే చేసినట్లు చూపించారు ఈ చిత్రంలో. అలాగే ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మాధ్యమం పెడితే నారాయణ స్కూల్స్ నాశనం అవుతుందంటూ చంద్రబాబు చెప్పడాన్ని చూపించారు.
ఆ తర్వాత పవన్ కల్యాణ్, చంద్రబాబు మాట్లాడడం.. ముఖ్యంగా గొడవ పడడం చూపిస్తారు. ఆ తర్వాత జరిగిన గొడవలు.. చంద్రబాబు అరెస్టును వివరించారు. ఇక చివర్లో మార్చి ఒకటో తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆ పూర్తి వివరాలు ఈ ట్రైలర్ లో చూసేయండి.


Click it and Unblock the Notifications











