ఇండస్ట్రీకి మరో కమల్ హాసన్ దొరికేశాడు.. డైరెక్టర్ మహా కామెంట్స్ వైరల్!

భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన నటుల్లో కమల్ హాసన్ ఒకరు. కేవలం ఆరేళ్ల వయసులోనే సినీ రంగ ప్రవేశం చేశారు. తొలి సినిమాతోనే జాతీయ ఉత్తమ బాలనటుడి అవార్డు అందుకున్నారు.మరో చరిత్ర, సాగర సంగమం, స్వాతిముత్యం,నాయకుడు, భారతీయుడు వంటి ఎన్నో క్లాసిక్ సినిమాల్లో నటించి, తన నట విశ్వరూపాన్ని చూపించారు. పాత్రలో పూర్తిగా లీనమై, ప్రతి సినిమాలో కొత్తదనాన్ని చూపించడం కమల్ ప్రత్యేకత. ఆయన నటనకు ఎన్నో అవార్డులు దాసోహమన్నాయి. కమల్ హాసన్ కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడు, రచయిత, నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేశారు. అలాగే లెజండరీ యాక్టర్‌తో యంగ్ నటుడు సత్యదేవ్‌ ను సరిపొల్చడం చర్చనీయంగా మారింది. ఆ డైరెక్టర్ ఎవరు? ఇంతకీ ఏమన్నారు?

Also Read
Peddi Day 17 Box Office: వీకెండ్‌లో రాంచరణ్ దూకుడు.. పెద్ది మూవీ లాభాల్లోకి రావాలంటే?
Peddi Day 17 Box Office: వీకెండ్‌లో రాంచరణ్ దూకుడు.. పెద్ది మూవీ లాభాల్లోకి రావాలంటే?

నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ 'రావు బహదూర్', ఈ సినిమా జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ సినిమాను జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, అప్లాజ్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీపా థామస్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా 'దేశ సంచారి' అనే స్పెషల్ సాంగ్ ను విడుదల చేశారు.

Cocktail 2 Day 2 Box Office collection: షాహిద్-రష్మిక మ్యాజిక్ వర్కౌట్.. 'కాక్‌టెయిల్ 2'కి ఎన్ని కోట్లంటే?

Director Venkatesh Maha Compares Satyadev to Kamal Haasan in Rao Bahadur Event Comments Create Buzz

ఈ సందర్భంగా సత్యదేవ్ మాట్లాడుతూ.. తాను ఈ సినిమాలో ఏడు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తానని తెలిపారు. ప్రతి పాత్రకు ప్రత్యేకత ఉంటుందని, వాటిలో 'రామప్ప' పాత్ర తనకు అత్యంత ఇష్టమైనదని చెప్పారు. అయితే ఈ ఈవెంట్ లో దర్శకుడు వెంకటేష్ మహా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. సత్యదేవ్ నటనపై ప్రశంసలు కురిపిస్తూ.. 'రావు బహదూర్'లో అతని పెర్ఫార్మెన్స్ వేరే లెవల్ అని ఏకంగా స్టార్ హీరో, లోకనాయకుడు కమల్ హాసన్ తో పోల్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Recommended For You
నాకు అలాంటి సమస్యలు.. ఎన్నో కష్టాలు.. బిగ్‌బాస్ తనూజ మనసులో బాధ..
నాకు అలాంటి సమస్యలు.. ఎన్నో కష్టాలు.. బిగ్‌బాస్ తనూజ మనసులో బాధ..

వెంకటేష్ మహా మాట్లాడుతూ..'ఇటీవలే మా మూవీ టీం అంతా కలిసి సినిమా అవుట్‌పుట్ చూశాం. ఆ సమయంలో ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది. గతంలో కమల్ హాసన్ గారు మాట్లాడుతూ.. 'నా తర్వాతి తరంలో నా లాగా నటించే నటుడు కనిపిస్తే, నేను సినిమాల నుండి రిటైర్ అవుతాను'అని అన్నారట. కమల్ సర్.. మీరు అసలు రిటైర్ అవ్వొదు. ఎందుకంటే.. మీరు మా అందరికీ స్ఫూర్తి, దాదాపు 60 సంవత్సరాలుగా, మీరు ఎప్పటికీ రిటైర్ అవ్వకూడదు. కానీ, మీరు కోరుకున్నట్లుగా మీ లాగా, మీ స్థాయిలో నటించే నెక్ట్స్ జనరేషన్ యాక్టర్ మన ముందుకు వచ్చేసాడు. ఆ నటుడే సత్యదేవ్. 'రావు బహదూర్' సినిమాలో అతని నటన వేరే లెవల్'అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ థ్రిల్లర్ మూవీ సత్యదేవ్ కెరీర్‌లో ఓ మైల్ స్టోన్ గా మారుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

You May Also Like
ఆ వయసులో తల్లి అయితే కష్టమే.. మాతృత్వంపై సమంత కామెంట్స్!
ఆ వయసులో తల్లి అయితే కష్టమే.. మాతృత్వంపై సమంత కామెంట్స్!

అయితే.. ఈ కామెంట్స్ వైరల్ మీడియాలో వైరల్ కావడంతో పలు కామెంట్స్ వస్తున్నాయి. దర్శకుడు తన హీరోను ప్రశంసించడంలో తప్పేమీ లేదు. కానీ సత్యదేవ్‌ను కమల్ హాసన్‌తో పోల్చడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. కమల్ హాసన్ అంటే 'స్వాతిముత్యం', 'సాగర సంగమం', 'నాయకుడు' వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలతో భారతీయ సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసిన దిగ్గజ నటుడు. అలాంటి లెజండరీ యాక్టర్ తో సత్యదేవ్ పోల్చడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ కామెంట్స్ ఏ వివాదానికి దారి తీస్తాయో వేచిచూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X