రవీనా టాండన్ దాడి ఘటనలో తప్పు ఎవరిదో తేల్చేసిన సీసీటీవీ ఫుటేజి.. ఈ వీడియో చూశారా?
బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఈమెపై జరిగిన దాడి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇది కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనలో అసలు తప్పు ఎవరిది, కావాలని ఎవరు గొడవ చేశారనే దానిపై పోలీసులు క్లారిటీ ఇవ్వకముందే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ నెట్టింట వైరల్ అవుతోంది. అందులో అసలు తప్పు ఎవరు అనేది చాలా క్లారిటీగా కనిపిస్తోంది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రవీనా టాండన్ తో పాటు ఆమె కారు డ్రైవర్ పై పలువురు మహిళలు, ఓ గుంపు దాడి చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే అందులో ఆమె తనను కొట్టొదంటూ అక్కడి వాళ్లను బ్రతిమాలడం కూడా కనిపిస్తోంది. అయితే రవీనానే కావాలని తనను కొట్టిందని ఓ మహిళ ఆరోపించడం, తన ముక్కులోంచి రక్తం కూడా కారుతుందని చెప్పడం కూడా మనం ఆ వీడియోలో చూశాం. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లిన రవీనా టాండన్ కారు మరో కారును ఢీకొట్టిందని అందులో ఉన్న వాళ్లు గాయపడగా.. వారు రవీనా డ్రైవర్ ను కొట్టినట్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

అంతేకాకుండా డ్రైవర్ ను కొడుతుంటే ఆపబోయిన రవీనాపై కూడా వాళ్లు దాడి చేశారు. అలాగే రవీనా కూడా వాళ్లను తిరిగి కొట్టిందని అక్కడి వాళ్లు ఆరోపించారు. అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గంటల వ్యవధిలోనే అసలు తప్పు ఎవరిది అనే దానిపై ఈ సీసీటీవీ ఫుటేజీ క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా ఆ సీసీటీవీ ఫుటేజీలో రవీనా కారు చాలా పక్క నుంచే వస్తుంది. ఆ కారు పక్కనే మరో కారు ఆగి ఉంది.
అలాగే అక్కడి నుంచి పలువురు మహిళలు బుర్కాలు ధరించి అటువైపు వెళ్తున్నారు. కనీసం వారికి ఆనను కూడా ఆనకుండా రవీనా టాండన్ కారు వచ్చింది. కానీ ఆ గుంపులోంచి ఓ మహిళ వచ్చి రవీనా టాండన్ కారు డ్రైవర్ తో గొడవ పడింది. అక్కడ చాలా సేపు మాటల యుద్ధం జరగ్గా.. వారు పక్కకు వెళ్లారు. ఆ తర్వాత అసలు గొడవ జరిగింది. ఈక్రమంలోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ సాగిస్తున్నారు.
OTTలోకి నాగబాబు సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. "పరువు" హత్య స్టోరీని ఎక్కడ చూడాలంటే?
అయితే ఇప్పటి వరకు రవీనా టాండన్ ఈ ఘటనపై స్పందించలేదు. అసలు తప్పు ఎవరిది అని చెప్పలేదు. కానీ సీసీటీవీ ఫుటేజీ చూసిన వారంతా రవీనాది తప్పేమీ లేదని.. తన డ్రైవర్ ను కాపాడుకునే ప్రయత్నం మాత్రమే చేసిందని అంటున్నారు. కావాలనే రవీనాపై వాళ్లు తప్పుడు ఆరోపణలు చేసిన గొడవను పెద్దది చేశారని అంటున్నారు. మీరు కూడా ఓసారి ఈ సీసీటీవీ ఫుటేజీ చూసేయండి. మీకేమనిపిస్తోంది కామెంట్ల రూపంలో చెప్పేయండి.


Click it and Unblock the Notifications











