ఇన్నాళ్లు ఆంధ్రా సినిమాలు తెలంగాణలో చూడలేదా? బయ్యర్‌పై పూరి కామెంట్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. డబుల్ దిమాక్ హైదరబాదీ అనేది ట్యాగ్ లైన్. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్సుగా నటించిన ఈ మూవీని శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం జులై 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
రామ్‌తో పాటు చిత్ర బృందం తొలి కాపీనీ వీక్షించారు. అనంతరం పూరి మీడియాతో మాట్లాడుతూ... ఇస్మార్ట్ శంకర్ మూవీ అయిపోయింది. సెన్సార్ ఆఫీసర్ చూసి ఒక స్టాంప్ వేస్తే రిలీజ్‌కు వెళ్లి పోవడమే ఆలస్యం. రామ్‌తో కలిసి ఫస్ట్ టైమ్ పని చేస్తున్నాను. రామ్ వాడుకున్నోడికి వాడుకున్నంత. నాకు చేతనైనంత వాడాను. ఇంకా బోలెడు ఉంది అన్నారు.

ఇస్మార్ట్ శంకర్ మీ మైండ్‌లో రింగ్ అవుతూ ఉంటాడు
ఈ సినిమాలో క్యారెక్టర్ రామ్ మామూలుగా చేయలేదు. ఇస్మార్ట్ శంకర్ మీ మైండ్‌లో రింగ్ అవుతూ ఉంటాడు. టెంపర్ ఫంక్షన్ అప్పుడు చెప్పాను తారక్ క్యారెక్టర్ ఎప్పటికీ నిలిచిపోయేలా ఉంటుందని, మళ్లీ ఈ రోజు చెబుతున్నాను. ఇస్మార్ట్ శంకర్‌ను ఇప్పట్లో మీరు మరిచిపోలేరు. రామ్ గ్రేట్ యాక్టర్.... అని పూరి చెప్పుకొచ్చారు.

ఇన్నాళ్లు ఆంధ్రా సినిమాలు తెలంగాణలో చూడలేదా?
ఈ సినిమా చూస్తే కొత్తవాళ్లు యాక్టింగ్ నేర్చుకోవచ్చు. ముఖ్యంగా రామ్ మాట్లాడిన తెలంగాణ యాస సినిమాకు హైలెట్. అలా అందరూ చెప్పలేరు. మొన్న వైజాగ్ బయ్యర్ ఒకరు సర్ ఇక్కడ సినిమాల్లో తెలంగాణ యాస ఎక్కువైంది, మార్ ముంతా చోడ్ చింతా అంటున్నారు...ఎవరికీ అర్థం కావడం లేదు, వైజాగ్ ఏరియాకు అంత డబ్బు రాదేమో అనే సందేహం వ్యక్తం చేశారు. తెలంగాణ యాస ఆంధ్రకు అర్థం కాకపోవడమేంటి? ఇన్నాళ్లు తెలంగాణలో ఆంధ్రా సినిమాలు చూడలేదా? అంటూ.... పూరి ప్రశ్నించారు.

ఆ సినిమాలు అర్థం కాకపోయినా చూడటం లేదా?
అదే వైజాగ్ లో హిందీ సినిమాలు ఆడుతుంటాయి... అక్కడ 80 శాతం మందికి హిందీ రాదు అయినా చూస్తుంటారు. ఇంగ్లీష్ సినిమాలు చూస్తుంటారు వారికేమైనా అర్థమవుతుందా? సినిమా బావుంటే పోతారంతే. అదే వైజాగ్‌లో నేను 40 ఏళ్ల క్రితం చైనీస్ సినిమా చూశాను. డైరెక్ట్ చైనీస్ లాంగ్వేజ్ సబ్ టైటిల్స్ కూడా లేవు. అయినా కుంగు ఫూ సినిమాలు చూసేవాడిని, నాకు తెలిసి ఆ బయ్యర్ నాకు డబ్బులు తక్కువ ఇవ్వడం కోసమే అలా అని ఉంటారు. ఇది ఒక మంచి సినిమా. కంప్లీట్ మాస్ ఎంటర్టెనర్. చాలా మందికి రామ్‌ను ఇమిటేట్ చేయాలనిపిస్తుంది... అని పూరి చెప్పుకొచ్చారు.

ఇస్మార్ట్ శంకర్
రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నరు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రియల్ సతీష్, సాహిత్యం: భాస్కరభట్ల, ఎడిటర్: జునైద్ సిద్ధికీ, ఆర్ట్: జానీ షేక్, సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, మ్యూజిక్: మణిశర్మ, నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











