Double Ismart Trailer Review: డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ రివ్యూ.. బాక్సాఫీస్‌కు కర్మకాండే.. రామ్ ఊరమాస్!
ఉస్తాద్ రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్. గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమా రాబోతున్నది. పూరీ కనెక్ట్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా రూపొందించిన ఈ చిత్రం ఆగస్టు 11వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ క్రమంలో ప్రమోషన్‌లో భాగంగా విశాఖపట్నంలో ట్రైలర్‌ను గ్రాండ్‌గా ఆవిష్కరించారు. ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందంటే?
ట్రైలర్ ఆరంభంలోనే నేను ఎవరో తెలుసా? అని రామ్ అడిగితే.. తలకు యూఎస్‌బీ పోర్టు పెట్టుకొని తిరుగుతున్న ఒకే ఒక ఇడియెట్ అంటే సంజయ్ దత్‌కు హీరోయిన్ కావ్య థాపర్ చెబితే.... రామ్.. ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ అంటూ తన పరిచయం చేసుకోవడం ద్వారా రామ్ క్యారెక్టర్ మరోసారి దుమారం రేపుతుందనే విషయాన్ని పూరి చెప్పకనే చెప్పారు.

అయితే డబుల్ ఇస్మార్ట్ మన టార్గెట్ అంటూ సంజయ్ దత్ చెప్పడంతో కథపై క్యూరియాసిటిని కలిగించాడు. ట్రైలర్‌ను మంచి జోష్‌తో ముందుకు తీసుకెళ్లేలా కట్ చేశారు. ఇక రామ్ చేత చెప్పించిన డైలాగ్స్ మాత్రం మాస్ ఆడియెన్స్‌ను కేకపెట్టించేలా ఉన్నాయి. గుంజి కొడితే గుడ్డు గులాబ్ జామ్ అవుతుంది అంటూ చెప్పిన డైలాగ్స్ కిర్రాక్‌లా ఉన్నాయి.
ఇక మాస్ సీన్లు, డైలాగ్స్ మాత్రమే కాకుండా హీరో, హీరోయిన్ల రొమాన్స్ కూడా బ్రహ్మండంగా కనిపించింది. ఇంట్లోకి దిష్టి తీయించుకో.. లేకపోతే నీకు ఇస్మార్ట్ శంకర్ దిష్టి తగులుతుంది. మీ వదినేమో కుతుబ్ మినార్.. నేనేమో చార్మినార్.. రెండు గుద్దుకొంటే ఎలా ఉంటుందంటూ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. రామ్, కావ్య థాపర్ కెమిస్ట్రీ బాగా పండినట్టు ట్రైలర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.
ఇక సంజయ్ దత్ జీవితాంతం అమరుడిగా ఉండేలా ప్లాన్ చేసిన తన మెమోరీని ఇస్మార్ట్ శంకర్‌ను ట్రాన్స్‌ఫర్ చేయడమనే పాయింట్‌తో ట్రైలర్‌లో అసలు కథ చెప్పాడు. ఇప్పుడు నా బ్రెయిన్ నీ బ్రెయిన్ లోకి వెళ్లబోతున్నది. ఇప్పుడు నీవు నాలా మారబోతున్నావు అని సంజయ్ దత్ కథలోని మెయిన్ ఎలిమెంట్‌ను రివీల్ చేశారు.
ఇక బ్రెయిన్ ట్రాన్స్‌ఫర్ అనే కొత్త కాన్సెప్ట్ ద్వారా మాస్, మసాలాలు దట్టించి రూపొందించిన ఈ చిత్రంలో రామ్ పొతినేని మాస్ విశ్వరూపం చేయించాడని అర్ధమైంది. ఇక కర్మకాండ చేయిస్తానంటూ వార్నింగ్ ఇవ్వడం బట్టి థియేటర్లలో బాక్సాఫీస్ దద్దరిల్లడం ఖాయమనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











