పూరి జగన్నాథ్ రొమాంటిక్ సెట్‌లో అగ్నిప్రమాదం.. వీడియో

ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిన పూరి జగన్నాథ్ తన కొడుకును హీరోగా పెట్టి 'రొమాంటిక్' అనే సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. అయితే అనుకోకుండా ఆ సెట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం జరిగింది. సెట్ లో డెకరేషన్ కోసం వేసిన క్లాత్‌కి నిప్పు అంటుకోవడంతో మంటలు లేచాయి.

దీంతో వెంటనే అపరమత్తమైన చిత్రయూనిట్ ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. చివరకు ఎలాగోలా ఆ మంటలు ఆర్పేయడంతో చిత్రయూనిట్ ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఫైర్ సెఫ్టీకి సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఇటీవలే సైరా సెట్‌లో కూడా అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

Fire Accident in Puri Jagannadhs Romantic Sets

తన కొడుకు ఆకాష్ పూరీని ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కించి స్టార్ హీరోని చేయాలని తాపత్రయ పడుతున్న పూరి జగన్నాథ్.. రొమాంటిక్ సినిమా పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా సమాచారం. స్వయంగా తానే నిర్మాణ బాధ్యతలు చేపట్టి.. అనిల్ పాదూరి చేతిలో దర్శకత్వ బాధ్యతలు పెట్టారు పూరి జగన్నాథ్. చిత్రంలో ఆకాష్ పూరి సరసన అందాల భామ కేతికశర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇటీవలే విడుదలైన 'రొమాంటిక్' ఫస్ట్‌లుక్ పోస్టర్ యూత్ ఆడియన్స్‌కి కిక్కించింది. హీరోయిన్ కేతికశర్మను టాప్ లెస్‌గా వెనుక నుంచి చూపించి అందరి దృష్టినీ లాగేశారు. ఇక టాప్ లెస్‌గా ఉన్న హీరోయిన్‌ని తన కేతులతో చుట్టిపడేశాడు ఆకాష్ పూరి. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ చూస్తుంటే రొమాంటిక్ సినిమాలో రొమాన్స్ పీక్స్ స్టేజ్‌లో ఉంటుందని అర్థమవుతోంది. అతిత్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X