Hanuman ప్రశాంత్ వర్మకు నాని చిట్కా. . సక్సెస్ పార్ములా రివీల్ చేసిన హనుమాన్ డైరెక్టర్!

ప్రస్తుతం ఎక్కడ చూసిన హనుమాన్.. హనుమాన్... ఈ సినిమాతో దేశం అంతా ఉర్రూతలూగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ఈ సినిమాను చూసేందుకు ఇప్పిటికీ ప్రేక్షకులు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. చాలా చోట్ల సినిమా చూసేందుకు అసలు టికెట్లు దొరకట్లేదు. విడుదల అయి 10 రోజులు అవుతున్నా టికెట్లు దొరకట్లేదంటేనే ఈ సినిమా క్రేజ్ ఏంటో అర్థం అవుతుంది. అయితే ఈ సినిమా డైరెక్టర్ తొలిసారి తన సక్సెస్ ఫార్ములాను రివీల్ చేశారు. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 2016లో "అ!" అనే సినిమాతో తొలిసారి తెలుగు సినిమా రంగంలో అడుగు పెట్టారు. ఆ తర్వాత కల్కి, జాంబీ రెడ్డి, దట్ ఈజ్ మహాలక్ష్మి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమాలు మేకింగ్ పరంగా చాలా బాగా ఉన్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయాయి. జాంబీరెడ్డి కాస్త పర్వాలేదనిపించినా... డైరెక్టర్ ప్రశాంత్ వర్మ టాలెంట్ కు తగ్గట్లుగా మాత్రం పేరు రాలేదు. కానీ ఈయన తాజాగా తీసిన సినిమా హనుమాన్ తో ఆయన టాలెంట్ ఏంటో ప్రపంచమంతా తెలిసింది.

HanuMan Directot Prashanth Varma Success Formula Revealed Check Details

అయితే హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్టు కావడానికి అసలు కారణం ఒకటి ఉందని నేరుగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మే చెప్పారు. అయితే ఓ టాలీవుడ్ స్టార్ హీరో చెప్పిన ఆ మాటలే తాను ఇంత మంచి సినిమా తీయడానికి మార్గదర్శకాలుగా నిలిచాయన్నారు. అయితే ఆ హీరో మరెవరో కాదు నాచురల్ స్టార్ నాని. ఆయనే డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు కొన్ని మాటలు చెప్పాడని.. అవే తన సక్సెస్ ఫార్ములాగా నిలిచాయన్నారు. తాను నానితో మాట్లాడుతూ తన కష్టాల గురించి చెబుతుండగా.. మనం బడ్జెట్ విషయంలో రిస్ట్రిక్షన్స్ ఎదుర్కున్నప్పుడే మనలోని క్రియేటివిటీ బయటకు వస్తుందని అన్నారట.

అయితే నాని చెప్పిన ఆ మాటలు ప్రశాంత్ వర్మకు గట్టిగా తగిలాయట. తన మనసులో ఇప్పటికీ నాని చెప్పిన ఆ మాటలు మార్మోగుతున్నాయని.. చెప్పుకొచ్చారు. నాని చేసిన ఆ కామెంట్ల వల్లే తాను హనుమాన్ సినిమాను అంత తక్కువ బడ్జెట్ తో తీయగలిగానని అన్నారు. కేవలం 45 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. విడుదల అయిన పది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

HanuMan Directot Prashanth Varma Success Formula Revealed Check Details

హనుమాన్ మూవీ హిట్టు కావడంతో వచ్చే ఏడాది జై హనుమాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తానని ప్రశాంత్ వర్మ ఇప్పటికే చెప్పుకొచ్చారు. అయితే ఆ సినిమాలో మాత్రం హీరోగా స్టార్ హీరో ఉండబోతున్నారని అన్నారు. అయితే ఈ సినిమా కంటే ముందు తాను మరో రెండు సినిమాలు తీస్తానని.. అందులో ఒకటి అధీర కాగా.. మరోటి మహాకాళి అని చెప్పుకొచ్చారు. ముందు ముందు సినిమాల్లో కూడా నాని చెప్పిన మాటలు మదిలో ఉంచుకుంటే మరింత అద్బుతమైన చిత్రాలను తెరకెక్కించవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X