HBD Puri Jagannadh: పుడితే మళ్ళీ పూరీ‌లా పుట్టాలి.. 100కోట్లు మోసపోయినా వెనుకడుగు వేయని దర్శకుడు

హీరోల స్టైల్ ని చూసి చాలా మంది అభిమానులు వారిని ఫాలో అవుతారు. కానీ ఆ హీరోలకు అలాంటి స్టైల్ రావడానికి కారణం ఎవరు అనే విషయం గురించి చాల తక్కువ మంది ఆలోచిస్తారు. డైరెక్టర్ అనే పదానికి ఒక స్పెషల్ బ్రాండ్ సెట్ చేసిన దర్శకుడు ఎవరు అంటే పూరి జగన్నాథ్ అనే చెప్పాలి. రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు గెచ్చుకున్నాడు. సంచలన విజయాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జన్మదినం సెప్టెంబర్ 28. తన 54వ పుట్టినరోజు సందర్భంగా తెలుగు ఫిల్మీబీట్ బర్త్ డే విషెస్ అందిస్తూ...

పుడితే మళ్ళీ పూరి జగన్నాథ్ లా పుట్టాలి

పుడితే మళ్ళీ పూరి జగన్నాథ్ లా పుట్టాలి

పుడితే మళ్ళీ పూరి జగన్నాథ్ లా పుట్టాలి అని దర్శకుడు వివి.వినాయక్ ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్ గా చెప్పాడు. ఎవడు తప్పుగా మాట్లాడినా, కష్టాలు ఎన్ని వచ్చినా కూడా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్లిపోవడం పూరికి ఒక్కడికే సాధ్యమయ్యిందని ఒక ఇంటర్వ్యూలో వినాయక్ చెప్పిన విధానం ఎంతగానో ఆకట్టుకుంటుంది.

విజయాల తరువాత ఎదురుదెబ్బలు

విజయాల తరువాత ఎదురుదెబ్బలు

ఇక పూరి జగన్నాథ్ దర్శకుడు అయ్యాక సక్సెస్ లు బాగానే చూశాడు. కానీ వరుసగా సక్సెస్ లతో పాటు కష్టాలు ఎదురుదెబ్బలు కూడా గట్టిగానే తిన్నాడు. పూరి జగన్నాథ్ ఎవరితోనైనా స్నేహం చేశారు అంటే అస్సలు వదలరని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ వల్లే మోసపోవాల్సి వచ్చిందట. సంపాదించుకున్న డబ్బు ఒక్కసారిగా కనుమరగయ్యిందట.

నెవర్ బిఫోర్ అనేలా..

నెవర్ బిఫోర్ అనేలా..

బద్రి సినిమా తరువాత వరుస అవకాశాలు అందుకున్న పూరి జగన్నాథ్, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, దేశముదురు సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. దాదాపు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హిరోలందరితో వర్క్ చేశారు. పూరితో వర్క్ చేసిన ప్రతి ఒక్క హీరో కూడా సరికొత్త స్టైల్ లో కనిపించేవారు. ఇక పోకిరి తరువాత ఇండస్ట్రీలో నెవర్ బిఫోర్ అనేలా ఒక సంచలన విజయాన్ని అందుకున్నాడు.

 100కోట్ల వరకు మోసం చేశారు

100కోట్ల వరకు మోసం చేశారు

పోకిరి సినిమాను సొంత ప్రొడక్షన్ హౌజ్ వైష్ణో అకాడమీలో నిర్మించిన పూరి ఆ సినిమాతో మంచి ఆదాయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తరువాత కొంతమందిని నమ్మి తెలియని బిజినెస్ లలో డబ్బు పెట్టిన పూరి దాదాపు 100కోట్ల వరకు పోగొట్టుకున్నాడట. ఆ తరువాత మోసం జరిగిందని కూడా తెలుసుకున్నట్లు పూరి ఒక ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని బయటపెట్టాడు.

Recommended Video

Mahesh Babu Comments On Movie With Puri Jagannath
 ఇంట్లో కుక్కలకు కూడా తిండి పెట్టలేని పరిస్థితి.

ఇంట్లో కుక్కలకు కూడా తిండి పెట్టలేని పరిస్థితి.

కనీసం తన ఇంట్లో ఉండే పెంపుడు కుక్కలకు తిండి కూడా పెట్టలేని పరిస్థితిని ఎదుర్కొన్నానని, ఇక వాటిని పోషించలేక కొన్నిరోజుల పాటు స్నేహితులు వద్ద ఉంచానని కూడా అన్నాడు. ఇక ఆ తరువాత కొంత జాగ్రత్త పడడంతో మెల్లగా ఆర్థికంగా స్థిరపడినట్లు వివరణ ఇచ్చారు. ఇక ప్రస్తుతం పూరి, విజయ్ దేవరకొండతో ఒక పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కరణ్ జోహార్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆ సినిమా షూటింగ్ మళ్ళీ సరికొత్త షెడ్యూల్ తో ముంబైలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X