లైఫ్ ఇచ్చిన దర్శకుడికే పోటీ.. ఛార్మితో ముదిరిన హరీష్ శంకర్ వివాదం

మళ్ళీ చాలా కాలం తర్వాత టాలీవుడ్ సినిమా నుంచి సినిమాల వరద థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ ఏడాది ఆరంభమే భారీ హిట్స్ తో మొదలైంది. కానీ తర్వాత మూడు నాలుగు నెలలు సరైన సినిమాలు లేక థియేటర్స్ కి జనం కరువయ్యారు. కానీ ఎట్టకేలకి జూన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ ఆగమనంతో మళ్ళీ థియేటర్స్ లో పూర్వ వైభవం రాగా ఇప్పుడు ఈ భారీ సినిమా తర్వాత రానున్న డిసెంబర్ వరకు కూడా వరుస సినిమాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయి.

కాగా ఆగస్ట్ మొదటి మొదటి వారం నుంచే వారానికి మూడేసి సినిమాలు పైగానే రావడానికి సిద్ధం అవుతున్నాయి. కాగా ఈ ఆగస్ట్ 15 కి మాత్రం దాదాపు ఐదారు సినిమాలు ఉంటే వాటిలో మంచి బజ్ లో ఉన్న స్టార్ హీరోల సినిమాలు రెండు ఉన్నాయి. మరి ఆ చిత్రాలే మాస్ మజరాజ రవితేజ హీరోగా నటించిన "మిస్టర్ బచ్చన్" ఒకటైతే మరో సినిమా ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన మాస్ చిత్రం "డబుల్ ఇస్మార్ట్".

harish shankar clarity on puri jagannath and charmee kaur issue

కాగా రవితేజ చిత్రాన్ని దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించగా రామ్ తో సినిమాని దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించాడు. కాగా రెండు సినిమాలు ఒకే డేట్ లో వస్తున్నాయి. దీనితో రెండు సినిమాలకి క్లాష్ తప్పలేదు. అయితే ఈ క్లాష్ విషయమే డబుల్ ఇస్మార్ట్ నిర్మాత ఛార్మికి కోపం తెప్పించింది. దీనితో ఆమె సోషల్ మీడియాలో హరీష్ శంకర్, రవితేజ ఇద్దరినీ అన్ ఫాలో కొట్టడం చర్చకు దారి తీసింది.

అయితే ఎంత కాదనుకున్నా రవితేజకి తన కెరీర్ స్టార్టింగ్ లో పూరి జగన్నాథ్ ఎన్నో సెన్సేషనల్ హిట్స్ అందించాడు, అలాగే హరీష్ శంకర్ కూడా పూరి జగన్నాథ్ దగ్గర వర్క్ చేసాడు. దీనితో ఇద్దరికీ పూరి జగన్నాథ్ గురు లాంటి వాడే.. అలాంటిది తన మీదకే తమ సినిమా పోటీ పెట్టడం తనకి కాకపోయినా తన సాన్నిహిత వర్గాలకి అయినా కొంచెం కఱుకు గానే అనిపిస్తుంది. ఇలా పూరి నోరు విప్పకపోయినా ఛార్మి మాత్రం తన అసహనాన్ని వ్యక్తం చేసింది.

మరి లైఫ్ ఇచ్చిన దర్శకుడు మీదకే పోటీ అనే ప్రశ్నపై హరీష్ శంకర్ తనదైన తెలివైన ఆన్సర్ ఇచ్చేసాడు. నాకు పూరి గారికి ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉంది. నా సినిమా ఏదన్నా విడుదల అయితే మొదట కాల్ చేసేది పూరి గారు, వినాయక్ గారే అని ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో పూరి గారు నన్ను తప్పుగా అనుకుంటారని నేను అనుకోవడం లేదని ఒక్క సినిమా క్లాష్ ఉండడం వల్ల మా మధ్య మాటలు ఉండవు.. అసలు నేను అనుకోను ఎందుకంటే అయన నాకంటే ఎంతో ఆయన చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తారని తెలిపాడు.

harish shankar clarity on puri jagannath and charmee kaur issue

ఇక క్లాష్ మాటకి వస్తే మాకు ఉన్న కొన్ని కారణాలు మూలాన ఆ డేట్ లో వసున్నాం తప్ప కావాలని పోటీకి రావడం లేదని డబుల్ ఇస్మార్ట్ సినిమానే మొదటిగా డేట్ ని అనౌన్స్ చేశారు అది నాకు తెలుసు కానీ అది మంచి డేట్ ని మైత్రి నిర్మాత కూడా చెప్పడంతో మేము వేరే దారి లేక వస్తున్నామని హరీష్ తెలిపాడు. ఇక ఛార్మి ఇష్యూ కోసం కూడా హరీష్ మాట్లాడారు.

ఆవిడ ఆ సినిమాకి నిర్మాత ఆవిడ స్థానంలో నేను ఉన్నా కూడా మేము ముందు ఓ డేట్ అనౌన్స్ చేసినపుడు మరో సినిమా వస్తుంది అంటే నిర్మాతగా తప్పకుండా ఇరిటేషన్ ఉంటుంది. ఛార్మి గారిని ఇందులో నేను తప్పు పట్టను. ఆవిడ నన్ను అన్ ఫాలో కొట్టారో లేదో కూడా నేను చెక్ చేసుకోలేదు.. ఎవరో మీమ్స్ పంపితే చూసా అంతే తప్ప ఆ మీమ్స్ కూడా నేను పట్టించుకోను అని హరీష్ ఇద్దరి విషయంలో కూడా సేఫ్ ఆన్సర్ ఇచ్చి తప్పించుకున్నాడు. మరి దీనిపై పూరి కాంపౌండ్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X