ఇస్మార్ట్ శంకర్ కథను కొట్టేశారు.. పూరీ జగన్నాథ్‌కు హీరో ఆకాష్ వార్నింగ్
ఇస్మార్ట్ శంకర్ భారీ వసూళ్లతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద హంగామా చేస్తున్నది. ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకొన్న నేపథ్యంలో హీరో ఆకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాన్సెప్ట్ పరంగా చాలా కొత్తగా ఉండి.. కొత్తతరం ప్రేక్షకులు ఆదరణ లభించడంతో కోట్ల కాసుల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా వివాదంలో కూరుకూపోయింది. ఈ సినిమా కథ, కాన్సెప్ట్ మాదే అంటూ మీడియా సమావేశంలో అన్నారు.
తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 'ఇస్మార్ట్ శంకర్' మెయిన్ కాన్సెప్ట్ నాదే. ఒక వ్యక్తి మెదడును హీరోకి మార్పిడి చేయడమనే మూల కథతో 'ఇస్మార్ట్ శంకర్' రూపొందింది. ఇదే ఇతివృత్తంతో తెలుగు-తమిళ భాషల్లో తను తయారు చేసిన కథ, కథనాలతో తననే హీరోగా పెట్టి రాధ అనే మహిళా దర్శకురాలు ఒక సినిమా తీశారు. ఆ సినిమా తమిళంలో ఇప్పటికే 'నాన్ యార్' పేరుతొ విడుదలైంది. త్వరలో తెలుగులో 'కొత్తగా ఉన్నాడు' టైటిల్ తో త్వరలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు.

ఈ క్రమంలో 'ఇస్మార్ట్ శంకర్' రూపంలో షాక్ తగిలిందని ఆకాష్ పేర్కొన్నారు. ఈ విషయమై పూరి జగన్నాధ్ ను సంప్రదించాలని ప్రయత్నించాం.. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు. తమిళ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేశారు. సత్వర పరిష్కారం కోసం ఇక్కడ మీడియాను ఆశ్రయించాం అని ఆకాష్ తెలిపారు. తన వాదనను వినిపించే ఆధారాలను ఆకాష్ మీడియా ముందు ఉంచారు. సమస్య సామరస్యంగా పరిష్కారం కానీ పక్షంలో లీగల్‌గా ప్రొసీడ్ అయ్యేందుకు కూడా తానూ సిద్ధపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ వివాదంపై పూరీ జగన్నాథ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
కాగా ఇస్మార్ట్ శంకర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 25.4 కోట్ల షేర్ వసూలు చేసింది. నైజాలంలో ఈ సినిమామ అత్యధికంగా రూ.9.41 కోట్లు వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా 16 కోట్లకుపైగా వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











