సిద్ధమైన రామ్, బోయపాటి మూవీ
కథానాయకుడు రామ్ తన తాజా చిత్రాన్ని బోయపాటి శ్రీనుతో చేయబోతున్నాడనే విషయం తెలిసిందే. పూజా కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆత్రుతగా ఉన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమా యాక్షన్ తోపాటు పొలిటికల్ డ్రామాను కూడా టచ్ చేస్తుందని, టోటల్ గా ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా బోయపాటి దీన్ని తీర్చిదిద్దుతున్నాడు. రామ్ మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. కేరళ నేపథ్యంలో ఒక పాత్ర ఉంటుందని, దాన్ని చాలా శక్తివంతంగా బోయపాటి మలిచినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉంటారు. అయితే ఎవరినీ ఎంపిక చేయలేదు. వారి ఎంపిక కూడా త్వరలోనే పూర్తికాబోతోందని తెలుస్తోంది. 'అఖండ' హిట్ తరువాత బోయపాటి చేయబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. శ్రీనివాస చిట్టూరి నిర్మించబోతున్నారు.

బోయపాటి శ్రీను సినిమా అనగానే కథానాయకుడిని చాలా పవర్ ఫుల్‌గా చూపిస్తారు. ఆయన ప్రతి సినిమా ఇదే విషయాన్ని నిరూపిస్తోంది. అందుకు తగ్గట్లుగానే రామ్ కెరీర్‌ను మలుపు తిప్పేలా ఈ సినిమా ఉండబోతోందని, గతంలో ఎవరూ రామ్‌ను చూడని మాస్ కోణంలో పాత్రను తీర్చిదిద్దారని చెబుతున్నారు. ది వారియర్ మూవీ అనుకున్నస్థాయిలో ఫలితాన్నివ్వకపోవడతో ఈ సినిమాపై రామ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. తమ కథానాయకుడి ఆశలు ఈ చిత్రంలో నెరవేరతాయనే నమ్మకంతో రామ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











