రామ్ 2.0 చూశారా.. కళ్ళు చెదిరేలా కండలు తిరిగిన బాడీ!

ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తోనే ఇస్మార్ట్ శంకర్‌పై ఆసక్తిని పెంచారు. రామ్ మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రంలో రఫ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. వరుస ప్లాపుల తర్వాత పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. రామ్ సరసన ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరో రామ్‌కు కూడా ఈ చిత్రం చాలా కీలకం.

నేను శైలజ తర్వాత రామ్ కు సరైన విజయం లేదు. హీరో రామ్ ఈ చిత్రం కోసం ఎంతలా కష్టపడుతున్నారో చెప్పేందుకు ఈ ఫోటో ఓ ఉదాహరణ. జిమ్ లో చెమటలు కక్కేలా రామ్ కనిపిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో రామ్ సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇంతలా జిమ్‌లో కష్టపడుతున్నాడు. రామ్ కండలు తిరిగిన లుక్ వైరల్ అవుతోంది. ఈ ఫోటోలకు రామ్ తన ట్విట్టర్ లో రామ్ 2.0 అని క్యాప్షన్ పెట్టాడు.

Hero Ram Gym workout for Puri Jagannadhs Ismart Shankar movie

పూరి జగన్నాథ్ తన సొంత నిర్మాణంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నాడు. రామ్ చివరగా నటించిన హలో గురు ప్రేమ కోసమే చిత్రం యావరేజ్ గా నిలిచింది. ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని పూరి జగన్నాధ్ పూర్తి స్థాయిలో మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ ఓ తమిళ రీమేక్ చిత్రంలో నటించనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X