హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో ఇస్మార్ట్ శంకర్!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో రామ్ రఫ్ లుక్ లో అదరగొడుతున్నాడు. మాస్ కథలని కూడా స్టైలిష్ గా ప్రజెంట్ చేయడంలో పూరిదిట్ట. రామ్, పూరి కలయికలో వస్తున్న తొలి చిత్రం ఇది. ఈ చిత్రంలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఇష్మార్ట్ శంకర్ చిత్ర షూటింగ్ వారణాసిలో జరుగుతోంది.

ఇస్మార్ట్ శంకర్ కథ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని 2016లో విడువులైన హాలీవుడ్ చిత్రం క్రిమినల్ స్పూర్తితో రూపొందిస్తున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇందులో సిఐఏ ఏజెంట్ తాను చనిపోయే స్థితిలో కీలక సమాచారాన్ని ఓ క్రిమినల్ కు అందిస్తాడు. ఆ సమాచారంతో ఆ క్రిమినల్ ఏం చేశాడనేదే కథ. ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో క్రిమినల్ పాత్రలో నటిస్తున్నది హీరో రామ్ అని అంటున్నారు.

Hero Rams Ismart Shankar movie based on Hollywood movie Criminal

దీని ద్వారా రామ్ పాత్ర నెగిటివ్ షేడ్స్ లో ఉండబోతోందని అర్థం అవుతోంది. ఇస్మార్ట్ శంకర్ కథపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంతుంతో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. పూరిజగన్నాథ్ ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసే వేసవిలోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X