ఛార్మి ప్రవర్తన చూసి షాకయ్యాం.. ఓ నిర్మాత అయి ఉండి కూడా.. ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్స్
డౌన్ ఫాల్‌లో ఉన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ మంచి విజయం కోసం ఆరాట పడుతున్నారు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టేయాలని హీరోయిన్, నిర్మాత ఛార్మితో కలిసి సూపర్ స్కెచ్ వేసిన ఈ డాషింగ్ డైరెక్టర్ మాంచి మాస్ మసాలా సినిమాను రూపొందిస్తున్నారు. తమ ఆలోచనలకు పదును పెడుతూ రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' సినిమా తెరకెక్కిస్తున్నారు పూరి, ఛార్మి. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు రావడంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఛార్మికి సంబంధించి ఆసక్తికర విషయాన్ని చెప్పారు ఇస్మార్ట్ హీరోయిన్స్.

దిమాక్ ఖరాబ్ లిరికల్ వీడియో
ఇస్మార్ట్ శంకర్ నుంచి ఇటీవలే మాస్ మసాలా ఐటెం సాంగ్ 'దిమాక్ ఖరాబ్' లిరికల్ వీడియోను విడుదల చేయడం జరిగింది. ఈ వీడియొ చూస్తుంటే మాస్ ప్రేక్షకులని ఆకట్టుకునేలా ఉన్న ఈ సాంగ్ థియేటర్లను ఈలలతో గోల పెట్టించడం ఖాయం అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ లిరికల్ సాంగ్ ఆన్ లైన్ లో రచ్చ చేస్తూ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతోంది.

ఢిల్లీ ధాబాలో అందాల భామలతో రామ్ రొమాన్స్
మణిశర్మ అందించిన బాణీల్లో హీరో రామ్.. ఇద్దరు అందాల భామలతో ఓ రేంజ్‌లో రొమాన్స్ చేసేశాడు. అదికూడా ఢిల్లీ డాబా తరహాలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఊర మాస్ స్టెప్పులతో నిధి అగర్వాల్, నభా నటేష్ రెచ్చిపోయి పెర్ఫామ్ చేశారు. మేముండగా ఐటెం భామలెందుకు అన్నట్లుగా వీరి చిందులు చించేశాయి.

చాలా ఎంజాయ్ చేశాం
ఈ పాట ఆడియన్స్ ని బాగా కనెక్ట్ కావడంతో.. సాంగ్ చేస్తున్న సమయంలో తమ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది వీడియో రూపంలో వెల్లడించారు ఇస్మార్ట్ హీరోయిన్స్. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అర్థం కాకపోయినా వాటిలో రైమింగ్ చాలా బాగుందని నిధి చెప్పగా, ఏకంగా పాట పాడి నభా ఆనందం వ్యక్తం చేసింది. తెలంగాణ యాసలో సాగిన ఈ పాటలో ఫుల్లుగా ఎంజాయ్ చేశామని ఇద్దరు హీరోయిన్స్ పేర్కొన్నారు.

ఛార్మిలో ఆ కోణం చూసి షాకయ్యాం.. అసలు కిక్ అదే
ఇక చిత్ర నిర్మాత ఛార్మి గురించి మాట్లాడిన ఈ భామలు.. ఛార్మి ఓ ఫ్రెండ్ లా కలిసిపోవడం ఆశ్చర్యపరిచిందని, ప్రొడ్యూసర్ అనే విషయాన్నే మరిచి తమతో కలిసి హుషారుగా ఎంజాయ్ చేస్తుండటం షాక్ ఇచ్చిందని చెప్పారు. అలాగే అసలు కిక్ అంటే ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో చిందులేయడమే అని ఇద్దరు భామలు తెలపడం విశేషం.


Click it and Unblock the Notifications











