Don't Miss!
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
సీనియర్ దర్శకుడి ఇంట్లో ఛార్మి.. ఇద్దరూ కలిసి అలా!! ఆ చనువు చూస్తే.. షాకవుతున్న నెటిజన్స్
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం, ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలు తెలియపర్చడం ఛార్మికి అలవాటేగా. ఇందులో భాగంగానే ఓ సీనియర్ దర్శకుడితో కలిసి ప్రైవేట్ పార్టీ చేసుకున్న కొన్ని ఫోటోలు షేర్ చేసి వార్తల్లో నిలిచింది ఈ బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్. ఇంతకీ ఎవరా సీనియర్ దర్శకుడు? ఛార్మి షేర్ చేసిన ఆ ఫోటోల గురించిన మ్యాటర్ ఏంటి? వివరాల్లోకి పోతే..
ఆ దర్శకుడితో 'నీ తోడు కావాలి'
భీమినేని శ్రీనివాస రావు దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా నటించిన ‘నీ తోడు కావాలి' సినిమాతో హీరోయిన్గా పరిచమైన ఛార్మి కౌర్.. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో కలిపి దాదాపు 60కి పైగా చిత్రాల్లో నటించి సౌత్ సినీ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ కూడగట్టుకుంది.
ఇస్మార్ట్ ఛార్మి.. యమ హుషారు
ఇకపోతే పూరీ జగన్నాథ్‌తో కలిసి పూరీ కనెక్ట్స్ అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించిన ఛార్మి.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందే సినిమాలతో పాటుగా ఈ బ్యానర్లో తెరకెక్కే సినిమాల నిర్మాణ బాధ్యతలను భుజాలపై వేసుకుంది. ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించి మంచి హుషారులో ఉన్నారు పూరి- ఛార్మి.
సీనియర్ దర్శకుడితో ప్రైవేట్ పార్టీ..
తాజాగా సీనియర్ దర్శకుడు జయంత్ సి. పరాన్జీతో కలిసి పెద్ద పార్టీ చేసుకుంది ఛార్మి. ఆయనతో అలా అలా పార్టీ ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసి.. తమ స్నేహానికి 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పార్టీ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అప్పట్లో 2005లో.. ఎంజాయింగ్ బ్యూటీ
బాలకృష్ణ హీరోగా నటించిన ‘అల్లరి పిడుగు' సినిమాలో తొలిసారి జయంత్ సి. పరాన్జీతో కలిసి పనిచేసింది ఛార్మి. 2005లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా ఈ ఇద్దరి మధ్య స్నేహం మాత్రం ఫుల్ సక్సెస్ అయింది. మొత్తానికి ఇలా ఛార్మి ఎంజాయ్ చూసి.. ''ఎంతైనా ఛార్మి అంటే ఛార్మినే, ఎంజాయింగ్ బ్యూటీ'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
Recommended Video
|
ఆ దర్శకుడి అనుభవం..
ఇక జయంత్ సి. పరాన్జీ విషయానికొస్తే.. ''ప్రేమించుకుందాం రా, బావగారు బాగున్నారా, శంకర్ దాదా ఎంబిబిఎస్, టక్కరి దొంగ, ఈశ్వర్, లక్ష్మీ నరసింహ, తీన్ మార్'' లాంటి సూపర్ డూపర్ హిట్స్ రూపొందించిన అనుభవం ఆయనది. దాదాపుగా టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరి సినిమాలకు దర్శకత్వం వహించారు జయంత్ సి. పరాన్జీ.