ఆమె కోసం ముంబై వెళ్ళా.. నాకే షాకిచ్చింది: అనుష్క సీక్రెట్స్ బయటపెట్టిన పూరి జగన్నాథ్
సూపర్ అంటూ తెలుగు తెరకు పరిచయమైన అనుష్క.. సక్సెస్‌ఫుల్ జర్నీ కొనసాగిస్తూ సూపర్ సక్సెస్ సాధించింది. ఎన్నో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ తన 15 సంవత్సరాల సినీ జర్నీ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఆమె 15 ఇయర్స్ సెలెబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఆ వేదికపై పూరి జగన్నాథ్ చేసిన కామెంట్స్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాయి. ఆ వివరాలేంటో చూద్దామా..

నాగార్జున సరసన అనుష్క.. గ్లామర్ బ్యూటీగా అటాక్
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సూపర్' సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది స్వీటీ అనుష్క. ఈ సినిమాలో నాగార్జున సరసన నటించి గ్లామర్ బ్యూటీగా మొదటి సినిమాతోనే పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత ఆమె కెరీర్‌లో విక్రమార్కుడు, అరుంధతి, బాహుబలి లాంటి భారీ విజయాలు పడటంతో టాలీవుడ్ టాప్ స్టార్‌గా నిలిచింది.

రాజమౌళి, రాఘవేంద్ర రావు, పూరి జగన్నాథ్..
2005 సంవత్సరంలో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనుష్క.. తన 15 సంవత్సరాల వెండితెర ప్రయాణం పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఆమె 15 ఇయర్స్ సెలెబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి, రాఘవేంద్ర రావు, పూరి జగన్నాథ్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు.

ముంబై వెళ్ళా.. ఆ మాట అడగ్గానే షాకిచ్చింది
ఈ సందర్భంగా అనుష్కను పరిచయం చేసిన పూరి జగన్నాథ్.. ఆమెకు సంబంధించిన కొన్ని విశేషాలు చెప్పి ఆసక్తి కలిగించారు. మొదటి అనుష్కను ముంబైలో కలిశానని, మంచి హైట్, ఆ అందం చూసి హీరోయిన్‌గా బాగా పనికొస్తుందని అనుకున్నానని చెప్పారు. అయితే యాక్టింగ్, డాన్సింగ్ వచ్చా? అని అడిగితే.. ఎప్పుడూ ట్రై చేయలేదని చెప్పడమే గాక వస్తుందో రాదో తనకే తెలియదని చెప్పి షాకిచ్చిందని పూరి చెప్పుకొచ్చారు.

ఆమెను నాగార్జున చూడగానే..
అయినా సరే అవకాశం ఇచ్చి చూద్దామని అన్నపూర్ణ స్టూడియోస్ కి తీసుకొచ్చామని, ఆడిషన్స్‌లో ఆమెను చూడగానే ఫిక్స్ అని నాగార్జున చెప్పారని పూరి జగన్నాథ్ అన్నారు. అలా మొదలైన ఆమె జర్నీ 'సూపర్'గా సాగిపోవడం ఆనందంగా ఉందని అన్నారు పూరి.

అనుష్క సీక్రెట్స్ బయటపెట్టిన పూరి..
ఇకపోతే అనుష్క అసలు పేరు బయటపెట్టడమే గాక, దాని వెనుక ఉన్న సీక్రెట్స్ కూడా రివీల్ చేశారు పూరి. అనుష్కను అందరూ ముద్దుగా పిలిచే స్వీటీనే ఆమె అసలు పేరు అని ఆయన చెప్పారు. 'సూపర్' సినిమా సమయంలో నాగార్జున మంచి స్క్రీన్ నేమ్ ఉంటే బాగుంటుందని సలహా ఇచ్చారని, ఆ సినిమాలో ఓ పాట పాడటానికి వచ్చిన సింగర్ పేరు అనుష్క కావడంతో.. ఆ పేరునే స్వీటీకి పెట్టాలని నిర్ణయించామని చెప్పారు. అలా స్వీటీ కాస్త అనుష్క అయ్యిందని ఆయన తెలిపారు.
Recommended Video


అనుష్క నిశ్శబ్దం
ప్రస్తుతం అనుష్క 'నిశ్శబ్దం' సినిమాలో నటిస్తోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాధవన్, షాలినీ పాండే ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











