చట్టం ఎవ్వరికీ చుట్టం కాదు.. పోలీసులకు చిక్కిన హీరో రామ్

Recommended Video

Hero Ram Fined By Hyderabad Police Near Charminar || Ismart Shankar || Filmibeat Telugu

చట్టం, న్యాయం ఎవ్వరికీ చుట్టాలు కాదు అని భారత రాజ్యాంగం తెలుపుతుంది. తప్పు చేసినా, నిబంధనలను అతిక్రమించినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సాధారణ ప్రజలకు ఏవైతే రూల్స్ వర్తిస్తాయో సెలెబ్రెటీలకు కూడా ఏవ్ రూల్స్ వర్తిస్తాయి. ఇప్పటికే పలు సందర్బాల్లో సెలెబ్రిటీలను సైతం సాధారణ పౌరుడిగానే ట్రీట్ చేసింది. పోలీసు యంత్రాంగం. తాజాగా అలాంటి మరో ఘటనతో చట్టం ఎవ్వరికీ చుట్టం కాదు.. రూల్ ఈజ్ రూల్.. అని నిరూపించింది పోలీసు శాఖ.

 ఇస్మార్ట్ శంకర్ షూటింగ్

ఇస్మార్ట్ శంకర్ షూటింగ్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ఇస్మార్ట్ శంకర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దేశ విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ చార్మినార్ పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే అక్కడి గుల్జార్ హౌజ్ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండగా పబ్లిక్ ప్లేస్‌లో దమ్ముకొడుతూ హీరో రామ్ పోలీసుల కంట్లో పడ్డాడు.

పబ్లిక్ ప్లేస్‌.. నో స్మోకింగ్ జోన్

ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ మధ్యలో కాస్త బ్రేక్ తీసుకున్న రామ్ సరదాగా సిగరెట్ అంటించాడు. అయితే అది నో స్మోకింగ్ జోన్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి అతనికి 200 రూపాయల ఫైన్ విధించారు. హీరో రామ్ షూటింగ్‌లో భాగంగానే సిగరెట్ కాల్చాడని తెలుస్తోంది. ఒకవేళ షూట్ కోసం కాల్చినా.. అది పబ్లిక్ ప్లేస్ కాబట్టి పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలా రామ్ పోలీసులకు ఫైన్ కట్టక తప్పలేదు.

పోలీస్ యంత్రాంగం పై పాజిటివ్ కామెంట్స్

పోలీస్ యంత్రాంగం పై పాజిటివ్ కామెంట్స్

చట్టం, న్యాయం అనే విషయాల్లో చిన్న- పెద్ద, సెలెబ్రిటీ- సాధారణ మనిషి అనే తేడా లేదని చాటిచెబుతూ పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు జనం. పోలీస్ యంత్రాంగం పని తీరు భేష్ అని, ప్రతీ సందర్భంలోనూ ఇలాగే వ్యవహరిస్తే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు.

మాస్ లుక్.. ఇద్దరు భామలతో రొమాన్స్

మాస్ లుక్.. ఇద్దరు భామలతో రొమాన్స్

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ పోతినేని మాస్ లుక్‌లో దర్శనమీయనున్నాడు. మాస్ ఆడియన్స్‌కి ఈ సినిమా స్పెషల్ ట్రీట్ ఇవ్వనుంది. ఇక ఇందులో పూరి స్టైల్ రొమాన్స్ మరో అట్రాక్షన్. ఇద్దరు అందాల భామలతో రామ్ రొమాన్స్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఇప్పటికే విడుదలైన పాటలు తెలియజేశాయి.

ఛార్మి, పూరి జగన్నాథ్ కలిసి

ఛార్మి, పూరి జగన్నాథ్ కలిసి

రామ్ హీరోగా తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాను ఛార్మి, పూరి జగన్నాథ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జులై 18 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X