Year Ender 2023: దేశం మెచ్చిన మలయాళ స్టార్ హీరోలు వీళ్లే... తండ్రీ, కొడుకులతో పాటు లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే?
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ప్రతి నెల, ప్రతి సంవత్సరం సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్‌లకు సంబంధించిన టాప్ నటీనటులు జాబితా విడుదల చేస్తుంటుంది. మరికొన్ని రోజుల్లో 2023 పూర్తి అయి 2024 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ సమయంలో 2023లో తమ తమ సినిమాలతో అదరగొట్టి, ప్రేక్షకులను అలరించిన నటీనటులు ఎవరో ఓర్మాక్స్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది. తాజాగా మలయాళ సినీ ఇండస్ట్రీలో 2023 నవంబరులో తమ సినిమాలతో ఆకట్టుకున్న హీరోలు ఎవరు, ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్‌గా నిలిచిన ఆ టాప్ -5 హీరోలెవరో ఓ లుక్కేద్దాం.
మమ్ముట్టి:మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఈ జాబితాలో టాప్ లో ఉన్నారు. కన్నూర్ స్క్వాడ్, కాథల్- ది కోర్, క్రిస్టోఫర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మమ్ముట్టి. ఈ చిత్రాలతో మంచి విజయం సొంతం చేసుకున్న ఆయన.. ఓర్మాక్స్ మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ (మలయాళం) 2023 నవంబర్ నెలకు టాప్ ప్లేస్‌లో ఉన్నారు.

మోహన్‌లాల్:ఓర్మాక్స్ మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ (మలయాళం) 2023 నవంబర్ నెలకు టాప్ 2 ప్లేస్‌లో నిలిచారు మోహన్ లాల్. ఈ మలయాళ సూపర్ స్టార్ తన నటనతో ఎప్పట్లాగే అలరించారు. తన సినిమాలతో ప్రేక్షకులను ఆదరించారు.
టోవినో థామస్:2023 సంవత్సరంలో తనదైన శైలి సినిమాలతో మరోసారి మైమరిపించారు టోవినో థామస్. 2018, అదృశ్య జలకంగళ్, నీలవెలిచామ్ సినిమాలతో ఆకట్టుకున్నాడు టోవినో థామస్.

దుల్కర్ సల్మాన్:కింగ్ ఆఫ్ కోతా, ఆది సినిమాలతో 2023 లో అలరించారు దుల్కర్ సల్మాన్. ఓర్మాక్స్ మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ (మలయాళం) 2023 నవంబర్ నెలకు టాప్ 4 ప్లేస్ లో నిలిచారు దుల్కర్ సల్మాన్. మలయాళ సినీ ప్రేక్షకులను విశేషంగా అలరించారు.

ఫాహద్ ఫాసిల్:ఓర్మాక్స్ మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ (మలయాళం) 2023 నవంబర్ నెలకు టాప్ 5 లో నిలిచారు ఫాహద్ ఫాసిల్. ధూమమ్, మామన్నన్, పాచువుమ్ అద్భుత విలక్కుమ్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











