Indian 2 Movie: భారతీయుడు 2 నుంచి సాలిడ్ అప్ డేట్, ఆరోజే గ్లింప్స్ విడుదల చేస్తారట!
లోక నాయకుడు కమల్ హాసన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయన సినిమాలు అన్న, ఆయన నటన అన్న దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరికీ ఫుల్ ఇష్టం. ఆయన కొత్త సినిమా వస్తుందంటే చాలు అందరూ తెగ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందుకే ఆయన కూడా 69 ఏళ్ల వయసులోనూ అనేక చిత్రాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రేక్షకులు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఆయన సినిమాలు చూస్తూ తెగ సంబర పడిపోతున్నారు.
1996లో శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా భారతీయుడు 2 రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ అయింది. పార్ట్ 1 సూపర్ డూపర్ హిట్టు కావడం, పార్ట్ 2 అంతకు మించి ఉంటుందని దర్శకుడు చెప్పడంతో ఇక అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ సాలిడ్ అప్ డేట్ ను చిత్రబృందం తెలిపింది. ఇండియన్ 2 గ్లింప్స్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

ఇండియన్ 2 సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను నవంబర్ మూడో తేదీన విడుదల చేయనున్నట్లు లైకా ప్రొడక్షన్స్ వాళ్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు చిత్రబృందం ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో కమల్ హాసన్ ప్రధానంగా కనిపిస్తుండగా... బ్యాగ్రౌండ్ లో జనాలు, జెండా వంటివి కనిపిస్తున్నాయి. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతుంది. అలాగే తమిల హీరో సిద్దార్థ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే అద్భుతమైన సంగీతాన్ని అందించేందుకు అనిరుధ్ రంగంలోకి దిగారు.
రెడ్ జెయింట్, లైకా ప్రొడక్షన్లు సంస్థలు సంయుక్తంగా భారతీయుడు 2 చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదల అయిన కమల్ హాసన్ లుక్ కు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇటీవలే విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమల్ హాసన్ అదే ఊపుతో ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్టుగా చేయాలనే కసితో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలను అలరించిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ అయిన ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

డైరెక్టర్ శంకర్ బిజీ షెడ్యూల్ కారణంగా ఇప్పటికే చాలా సార్లు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక సినిమా విడుదల విషయంలోనూ అదే వాయిదాలు కొనసాగుతున్నాయి. ఓవైపు కమల్ హాసన్ తో భారతీయుడు చేస్తూనే, మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి గేమ్ ఛేంజర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీని వల్లే ఇలా ఆలస్యం అవుతుంది. కానీ ఇప్పుడు ఎలాంటి అడ్డంకలు లేకుండా చిత్రం విడుదల చేసేందుకు చిత్రబృందం అన్ని ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగానే గ్లింప్స్ విడుదల తేదీని ప్రకటించింది.


Click it and Unblock the Notifications











