ఛార్మిని పూరీ వదిలేశాడా? పార్ట్‌నర్ లేకుండా స్టార్ హీరోతో మూవీ
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వరుసగా తను డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని అందుకుంటున్నాయి. చివరిగా వచ్చిన రెండు చిత్రాలు ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వకపోగా పూరిని నష్టాల పాలు చేశాయి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా మూవీ ' లైగర్ : చాలా క్రాస్ బ్రీడ్' చిత్రమైతే పూరి జగన్నాథ్ కు ఎలాంటి పరిస్థితిని తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రొడక్షన్ ధర్మ, పూరి జగన్నాథ్, నటి చార్మి కౌర్ సొంత బ్యానర్ పూరి కనెక్ట్స్ లో నిర్మించారు.
125 కోట్లు ఖర్చు చేసిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ నుంచి తిరిగి 60 కోట్లు మాత్రమే రిటర్న్ వచ్చింది. ఇక తర్వాత వచ్చిన డబుల్ ఇస్మార్ట్ చిత్రం కూడా ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ చిత్రం కూడా పూరి కనెక్ట్స్ బ్యానర్ లోనే రూపుదిద్దుకుంది. రామ్ పోతినేని తో 90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ నుంచి కేవలం 18 కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చింది. ఇక ఈ రెండు చిత్రాల కంటే ముందు వచ్చిన రొమాంటిక్ ఫిలిం కూడా పూరి కనెక్ట్స్ బ్యానర్ లోనే రూపుదిద్దుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం 7.7 కోట్లు తిరిగి ఇచ్చింది.

కాగా పూరి జగన్నాథ్, చార్మి కౌర్ నిర్మాతలుగా స్థాపించిన పూరి కనెక్ట్స్ లో వచ్చిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం పూరి జగన్నాథ్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. అయితే పూరి జగన్నాథ్ తన కెరీర్ లో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొన్నారు. మీ క్రమంలో ఎలాగైనా కంబ్యాక్ ఇస్తానని నమ్మకం ఆయన అభిమానులు దృఢంగా ఉంది. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ తర్వాత చిత్రానికి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఇకపై తను నిర్మించబోతున్న డైరెక్ట్ చేయబోతున్న సినిమాలకు నిర్మాతగా చార్మి కౌర్ ను ఉండనివ్వడం లేదని తెలుస్తోంది. ఇక తన సినిమాల విషయంలో తానే స్వయంగా జాగ్రత్తలు తీసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో పూరి జగన్నాథ్ సాలిడ్ కం బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు అంటూ ఫిలిం సర్కిల్స్లో గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి. మూడు క్రేజీ స్క్రిప్ట్స్ తో, ట్రైనింగ్ లో ఉన్న హీరోలతో పూరి జగన్నాథ్ సినిమా చేయబోతున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతానికి మాత్రం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తో సినిమా కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. ఇక సినిమాకు ఏకంగా 100 కోట్ల బడ్జెట్ ను ఖర్చు చేయబోతున్నారంట. అయితే పూరి జగన్నాథ్ కు సొంత ప్రొడక్షన్ హౌస్ పూరి టూరింగ్ టాకీస్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ బ్యానర్ లో చాలా సినిమాలు వచ్చి కాస్త లాభాలను అందించింది. అయితే ఇప్పుడు విజయ్ సేతుపతి తో చేయబోతున్న సినిమాను తన బ్యానర్ లోనే నిర్మించబోతున్నారా? లేక మరే ప్రొడక్షన్ హౌస్ లోనైనా నిర్మించబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది.
ఇక పూరి జగన్నాథ్, నటి చార్మి కౌర్ కాంబినేషన్లో పలు చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. నిర్మాతలుగా వీరిద్దరూ కలిసి కొన్నాళ్లపాటు ప్రయాణం చేశారు. జ్యోతిలక్ష్మి సినిమా నుంచి పదేళ్లపాటు వీరి మధ్య మంచి సంబంధాలు నెలకొన్నాయి. కానీ ప్రస్తుతం వరుసగా సినిమాల ఫలితాలు దెబ్బకొడుతుండటంతో బడ్జెట్ విషయంలో విభేదాలు వస్తున్నాయని రూమర్ కు తెరలేసింది. ఈ సందర్భంగానే పూరి జగన్నాథ్ తన రాబోయే చిత్రాలను తానే స్వయంగా డైరెక్ట్ చేయడంతో పాటు ప్రొడక్షన్ కు సంబంధించిన విషయాలను కూడా తానే చూసుకోబోతున్నారంటూ ఫిలిం సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. ఇక విజయ్ సేతుపతే కాకుండా గోపిచంద్ తోను పూరి జగన్నాథ్ మళ్లీ సినిమా తీయబోతున్నారంట కూడా ప్రచారం జరుగుతుంది.


Click it and Unblock the Notifications











