‘ఇస్మార్ట్ శంకర్’ ఆలస్యం: కారణం హీరోయిన్ పాస్‌పోర్టా? లేక పూరి బ్యాడ్ ప్లానింగా?
పూరి జగన్నాధ్ సినిమా అంటే అనుకున్న సమయంలోపే పూర్తవుతుంది. అయితే 'ఇస్మార్ట్ శంకర్' విషయంలో మాత్రం అలా జరుగడం లేదు. ఈ చిత్రం మే నెలలోనే విడుదల చేస్తామని గతంలో ప్రకటించిన పూరి... మే వచ్చినా ఇంకా షూటింగ్ పూర్తి చేయలేదు.
షూటింగ్ పూర్తి కావడానికి ఇంకొంత సమయం పడుతుందని తెలుస్తోంది. ఈ విషయంలో ఓ వింత వాదన తెరపైకి వచ్చింది. హీరోయిన్ నిధి అగర్వాల్ తన పాస్‌పోర్ట్ పొగొట్టుకోవడమే ఆలస్యానికికారణమంట. ఈ కారణంగా ఆమె యూరఫ్ షెడ్యూల్‌లో అనుకున్న సమయానికి జాయిన్ కాలేక పోయిందట.

దీంతో పూరి జగన్నాథ్ ఆమె పాస్ పోర్ట్ వచ్చేలోపు టైమ్ వేస్ట్ కాకుండా పెండింగులో ఉన్న కొన్ని సీన్లు హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారట. అయితే ఇది సరైన కారణం కాదని, ఇటు ఇస్మార్ట్ శంకర్ మూవీతో పాటు అటు తన కుమారుడు నటిస్తున్న 'రొమాంటిక్' సినిమాను కూడా ఒకేసారి చిత్రీకరిస్తుండటంతో షెడ్యూల్ కాస్త లేట్ అయిందని, పూరి బ్యాడ్ ప్లానింగే ఇందుకు కారణమని మరో వాదన కూడా ఉంది.
ఈ చిత్రంలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రియల్ సతీష్, సాహిత్యం: భాస్కరభట్ల, ఎడిటర్: జునైద్ సిద్ధికీ, ఆర్ట్: జానీ షేక్, సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, మ్యూజిక్: మణిశర్మ, నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











