ఇస్మార్ట్‌గా 100 రోజులు.. ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నా.. హీరో రామ్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ హంగామా ఇంకా కనిపిస్తోందంటే ఆ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. అంచనాలను మించి పర్ఫామ్ చేసిన ఈ సినిమా నిర్మాతలకు లాభాల పంట పండించడమే గాక నటీనటులకు మంచి లైఫ్ ఇచ్చింది. జులై 18వ తేదీన విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది.
ఈ సందర్బంగా 'ఇస్మార్ట్ శంకర్' విజయంపై సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు హీరో రామ్. ''ఇస్మార్ట్ శంకర్ అనేది కేవలం సినిమా మాత్రమే కాదు. ఇది నా జీవితంలో కొత్త దశ. ఈ సినిమా కారణంగా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నా. థాంక్యూ పూరి జగన్నాథ్ గారు. మీతో కలిసి పని చేయడాన్ని ప్రేమిస్తున్నా..'' అని పేర్కొన్నాడు రామ్. దీంతో పాటు 'ఇస్మార్ట్ శంకర్' 100 రోజుల పోస్టర్ కూడా షేర్ చేశాడు.

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో.. కేర్ లెస్ ఊరమాస్ తెలంగాణా అబ్బాయిగా రామ్ చేసిన క్యారెక్టర్, పూరి టేకింగ్ మాస్ ప్రేక్షకులను కట్టి పడేశాయి. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం, హీరోయిన్లు నిధి అగర్వాల్, నభా నటేష్ అందాలు ప్రేక్షకుల దిమాక్ ఖరాబ్ చేశాయి. ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌కి స్పెషల్ కిక్ ఇచ్చింది ఇస్మార్ట్ శంకర్ సినిమా.
వరల్డ్ వైడ్ గా 75కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా ఇస్మార్ట్ టీంకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇటీవలే పూరీ జగన్నాథ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాని మరోసారి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











