twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరి వరుస ప్లాపుల్లోనూ.. ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీకి అదిరిపోయే డీల్!

    |

    ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్లో రూపొందుతున్న తొలి చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. జులై 18న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు జోరందుకున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.

    'ఇస్మార్ట్ శంకర్' మూవీపై రిలీజ్ ముందే మంచి హైప్ రావడంతో ఈ చిత్రాన్ని దక్కించుకోవడానికి శాటిలైట్ ఛానల్స్, డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలు పోటీ పడుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జీటీవీ వారు ఈ చిత్రాన్ని ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్లు సమాచారం. ట్రైలర్ కూడా విడుదల కాకముందే ఈ మూవీ డీల్ క్లోజ్ కావడం చర్చనీయాంశం అయింది. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సైతం ఇదే సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

    iSmart Shankar getting Rs 14 Cr from satellite, digital companies

    'ఇస్మార్ట్ శంకర్' మూవీ మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందుతోంది. ఈ నేపథ్యంలో హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా మంచి ధరకు అమ్ముడైనట్లు సమాచారం. ఇలా అన్నీ కలిపి థియేట్రికల్ బిజినెస్ కాకుండానే రూ. 14 కోట్ల ఆదాయం వచ్చిందట.

    గత కొన్నేళ్లుగా పూరి జగన్నాథ్ వరుస ప్లాపుల కారణంగా ఆయన సినిమాలకు భారీ రేటు చెల్లించేందుకు శాటిలైట్ ఛానల్స్ ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 'ఇస్మార్ట్ శంకర్' మూవీకి రూ. 14 కోట్లు నాన్-థ్రియేట్రికల్ బిజినెస్ జరుగడం మంచి పరిణామంగా పేర్కొంటున్నారు.

    రామ్ సరసన నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నరు. పునీత్ ఇస్సార్‌, స‌త్య‌దేవ్‌, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను, సుధాంశు పాండే త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌, సాహిత్యం: భాస్క‌ర‌భ‌ట్ల‌, ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధికీ, ఆర్ట్‌: జానీ షేక్‌, సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌, మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌, నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్‌, ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌.

    English summary
    Film Nagar source said that, 'iSmart Shankar' will be getting Rs 14 Cr from satellite, digital companies.iSmart Shankar is a 2019 Telugu action comedy film produced and directed by Puri Jagannadh, under the banners of Puri Connects and Puri Jagannadh Touring Talkies. It is presented by Lavanya. It stars Ram Pothineni, Nidhhi Agerwal, Nabha Natesh and Satya Dev, with music composed by Mani Sharma.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X