ఫ్యాన్స్‌తో చలాకీగా హీరో రామ్.. క్యాలెండర్ రిలీజ్ చేసిన ఎనర్జిటిక్ స్టార్!
ఎనర్జిటిక్ ఫెర్ఫార్మెన్స్‌తో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకొన్న టాలీవుడ్ హీరోల్లో రామ్ ఒకరు. తనను అభిమానించే వారితో చాలా క్లోజ్‌గా ఉంటారనే పేరున్న హీరో అతను. తాజాగా కొత్త సంవత్సరంలో అభిమానులతో గడిపారు. అభిమానులు రూపొందించిన క్యాలెండర్‌ను విడుదల చేశారు. వారితో చాలా సేపు ముచ్చటించి యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు. మహిళా ఫ్యాన్స్ అడిగిన సరదా ప్రశ్నలకు రామ్ చలాకీగా సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది.
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న ఈస్మార్ట్ శంకర్ చిత్రంలో రామ్ ప్రస్తుతం నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం తన లుక్‌ను క్రేజీగా మార్చుకొన్నాడు. యూత్‌ను విశేషంగా ఆకట్టుకొనే మాస్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.

ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో రామ్ సరసన మిస్టర్ మజ్ను ఫేం నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి ఫేం రాజు తోట సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.



Click it and Unblock the Notifications











