మామా డేట్ మారింది.. కానీ అదే తోపు, అదే ఊపు: ‘ఇస్మార్ట్ శంకర్’పై రామ్ ట్వీట్
రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న 'ఇస్మార్ట్ శంకర్' రిలీజ్ డేట్ జులై 12న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రిలీజ్ డేట్ జులై 18కు మార్చారు. ఈ విషయాన్ని రామ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ''మామా రిలీజ్ డేట్ చేంజ్ అయింది, కానీ అదే తోపు... అదే ఊపు.. ఆరు రోజుల తర్వాత 18-07-2019న కిరికిరి'' అంటూ ట్వీట్ చేశారు.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. డబుల్ దిమాక్ హైదరబాదీ అనేది ట్యాగ్ లైన్. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్సుగా నటించిన ఈ మూవీని శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మే 15న రామ్ బర్త్ డే స్పెషల్‌గా టీజర్ రిలీజ్ చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో టీజర్ ఆకట్టుకుంది. రామ్ గెటప్, ఊరమాస్ లుక్, యాక్షన్ సీన్లు యువతకు నచ్చే విధంగా ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది. నాతో కిరికిరి అంటే.. పోశమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టే అని రామ్ చెప్పిన డైలాగ్స్ టీజర్‌లో హైలెట్ అనిచెప్పవచ్చు.
రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నరు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రియల్ సతీష్, సాహిత్యం: భాస్కరభట్ల, ఎడిటర్: జునైద్ సిద్ధికీ, ఆర్ట్: జానీ షేక్, సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, మ్యూజిక్: మణిశర్మ, నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











