చిరంజీవి, పూరి కలుస్తున్నారు.. ఏం జరుగబోతోందో?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఇష్మార్ట్ శంకర్'. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ జులై 18న విడుదలైన బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. కలెక్షన్ల పరంగా టాప్ పొజిషన్లో ఉండటంతో పాటు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆసక్తి చూపుతున్నారట. ఈ నేపథ్యంలో ఆయన కోసం చిత్ర బృందం గురువారం స్పెషల్ షో ఏర్పాటు చేసినట్లు సమాచారం. చిరంజీవితో కలిసి పూరి కూడా ఈ సినిమా చూబోతున్నారట.

గతంలో చింజీవితో సినిమా చేసే అవకాశం మూడు సార్లు పోగొట్టుకున్న పూరి... ఈ సారి ఆయన నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ స్పెషల్ షో తర్వాత ఏం జరుగబోతోంది? ఇద్దరి కాంబినేషన్ సెట్టయ్యే అవకాశం ఏమైనా ఉందా... అనేది వేచి చూడాలి.
ఇస్మార్ట్ శంకర్ మూవీ ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ 14.90 కోట్లకు అమ్మారు. 5 రోజుల్లో 22.40 కోట్ల షేర్ రాబట్టింది. నైజాంలో ఇప్పటికే మూడున్నకోట్లకుపైగా లాభం వచ్చింది. సినిమా బిజినెస్ పూర్తయ్యే సమయానికి అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు భారీ లాభాలు చూడటం ఖాయం అంటున్నారు.
రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నరు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రియల్ సతీష్, సాహిత్యం: భాస్కరభట్ల, ఎడిటర్: జునైద్ సిద్ధికీ, ఆర్ట్: జానీ షేక్, సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, మ్యూజిక్: మణిశర్మ, నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











