twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీ జాతిలో నా పుల్ల... ‘ఇస్మార్ట్ శంకర్’ ట్రైలర్లో రామ్ ఊరమాస్!

    |

    ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ అండ్ యాక్షన్ ఫిల్మ్ 'ఇస్మార్ట్ శంకర్'. జులై 18న ఈ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ల జోరు పెంచారు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది.

    ఊరమాస్ డైలాగులతో ట్రైలర్ దద్దరిల్లిపోయింది. పూరి తన అనుభవాన్నంతా రంగరించి... ఇప్పటి వరకు టాలీవుడ్లో ఎన్నడూ లేని విధంగా ఘాటైన మాస్ మసాలా దట్టించి ఈ చిత్రం తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది. హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.

    Ismart Shankar Theatrical Trailer super mass

    ఏ బొమ్మా.. నువ్వు ఓకే అంటే గొల్కొండ రిపేర్ చేసి నీ చేతులో పెడతా... నిన్ను బేగంను చేసి కిల్లా మీద కూర్చో పెడతా అంటూ అంటూ హీరో చెప్పే డైలాగులతో సినిమా మొదలైంది. రేయ్.. వరంగల్ కాలేజీలో పోరగాళ్లను ఉచ్చపోయించిన అంటూ హీరోయిన్ నభా నటేష్ కౌంటర్ ఇవ్వడం ట్రైలర్లో హైలెట్ అయింది.

    పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎగిరెగిరి చూపించిందట... నీ జాతిల నా పుల్ల అంటూ రామ్ చెప్పే డైలాగులు సినిమా ఎంత ఊరమాస్ లెవల్లో ఉంటుందో స్పష్టం చేస్తోంది. శంకర్ పాత్రలో రామ్ ట్రాన్ఫర్మేషన్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎవరూ కూడా ఈ ఎనర్జిటిక్ స్టార్‌ను ఇలా ఊహించి ఉండరు. ఈ క్రెడిట్ అంతా పూరి క్రియేటివిటీ అని చెప్పక తప్పదు. ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన కొన్ని రెండు గంటల్లోపే 1 మిలియన్ పైగా డిజిటల్ వ్యూస్ సొంతం చేసుకుంది.

    'ఇస్మార్ట్ శంకర్' అని టైటిల్ పెట్టడం వెనక ఓ ప్రధాన కారణం ఉంది. ఇందులో రామ్ తలలో పోలీసులు ఎలక్ట్రానిక్ చిప్ అమరుస్తారు. దాని వెనక కథ ఏమిటనేది సినిమాలో ఆసక్తికరంగా చూపించబోతున్నారు. నేను జైలు నుంచి తప్పించుకుంది బార్కస్ బిర్యానీ తినడానికి కాదు... యేట కొయ్యనీకే, పెద్దమ్మ గుళ్లో నిన్ను మొక్కి చాలా రోజులైంది. నువ్వే నా పొట్టేల్... అంటూ రామ్ విలన్‌తో చెప్పే డైలాగ్స్ బట్టి రివేంజ్ డ్రామాగా సినిమా ఉంటుందని తెలుస్తోంది.

    రామ్ సరసన నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నరు. పునీత్ ఇస్సార్‌, స‌త్య‌దేవ్‌, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను, సుధాంశు పాండే త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌, సాహిత్యం: భాస్క‌ర‌భ‌ట్ల‌, ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధికీ, ఆర్ట్‌: జానీ షేక్‌, సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌, మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌, నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్‌, ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌.

    English summary
    Ismart Shankar Theatrical Trailer. IsmartShankar Theatrical Trailer ft. Ram Pothineni , Nidhhi Agerwal, Nabha Natesh, Satya Dev . Written and Directed by Puri Jagannadh, Music composed by Mani Sharma, Produced by Puri Connects ( Puri Jagnnadh, charmme Kaur).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X