ఛార్మి ధైర్యం మామూలుగా లేదుగా.. మళ్ళీ అదే పని చేస్తోందట.. స్వయంగా తానే చెప్పేస్తూ!

ఒకప్పటిలా లేవు ఈ రోజులు. ఆ కాలంలో ఓ సినిమా విడుదలై ఏ మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా ఏకంగా 100 రోజులు, 200 రోజులు థియేటర్స్‌లో ఆడేది. కొని సినిమాలైతే ఏడాది పైగా ఆడిన ధాఖలాలూ ఉన్నాయి. కానీ పరిస్థితి మారింది. ఇప్పటి సినిమాలు ఓ మూడు వారాలు నడిచిందంటే చాలు ఆ బొమ్మ సూపర్ హిట్టు. ఈ లోగా ఇంకో సినిమా వచ్చి ఆ సినిమాను బీట్ చేస్తుంది. ఇలాంటి తరుణంలో ఛార్మి ధైర్యం చేస్తూ ఓ నిర్ణయానికి రావడం సెన్సేషన్ అవుతోంది. ఇంతకీ అసలు విషయం ఏంటి? అంటారా.. చూడండి మీకే తెలుస్తుంది.

అన్నీ తానై పూరితో ఛార్మి

అన్నీ తానై పూరితో ఛార్మి

గతంలో వెండితెరపై హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఛార్మి.. ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించి వరుస సినిమాలు నిర్మిస్తోంది. ప్రత్యేకంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలను నిర్మిస్తూ.. ఆ నిర్మాణ సంస్థకు సంబంధించిన పనుల్లో అన్నీ తానై భాగమవుతోంది.

ఇస్మార్ట్ శంకర్.. లాభాల పంట

ఇస్మార్ట్ శంకర్.. లాభాల పంట

ఇందులో భాగంగానే ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఛార్మి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సినిమాకు ''డబుల్ దిమాక్'' అనే ట్యాగ్ లైన్ పెట్టారు. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్ సహా నటీనటులందరికీ ఈ సినిమా ఘనవిజయం అందించి నిర్మాతలకు లాభాల పంట పండించింది.

 మరోసారి రెడీ అయిన ఛార్మి

మరోసారి రెడీ అయిన ఛార్మి

దాదాపు 3 వారాల పాటు థియేటర్స్‌లో దుమ్ము రేపింది ఇస్మార్ట్ శంకర్. ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌కి స్పెషల్ కిక్ ఇచ్చింది. దీంతో ఇస్మార్ట్ అభిమానులకు మరోసారి ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయింది ఛార్మి. దర్శకుడు పూరీ జగన్నాథ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాని మరోసారి రిలీజ్ చేస్తున్నామని పేర్కొంటూ వీడియో ద్వారా స్వయంగా తెలిపింది.

నీ థియేటర్‌లో మళ్లీ నా బొమ్మ అంటూ

'హాయ్ గాయ్స్, నీ థియేటర్‌లో మళ్లీ నా బొమ్మ' అంటూ ఓ వీడియోని ట్విట్టర్ వేదికగా పంచుకుంది ఛార్మి. తెలంగాణలోని ఐదు థియేటర్లలో అలాగే ఏపీలోని ఐదు థియేటర్లలో ఈ సినిమాను మళ్ళీ విడుదల చేస్తున్నట్లు అందులో పేర్కొంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఈ సినిమాని ప్రదర్శించబోతున్నామని థియేటర్స్ లిస్ట్ కూడా పెట్టేసింది ఛార్మి.

ఛార్మి ధైర్యం మామూలుగా లేదుగా

ఛార్మి ధైర్యం మామూలుగా లేదుగా

ఛార్మి చేస్తున్న ఈ ప్రయోగం చూసి ఛార్మి ధైర్యం మామూలుగా లేదుగా! అని చెప్పుకుంటున్నారు జనం. ఈ రోజుల్లో ఓ సినిమా కనీసం రెండు మూడు వారాలే ఆడటం కష్టం.. అలాంటిది రీ రిలీజ్ చేయడానికి రెడీ అయిందంటే ఛార్మి మహా ఘటికురాలే అనే టాక్ నడుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X