కొడుకు, కూతురిని చూసి భోరుమన్న జానీ మాస్టర్.. ఇంటికి అడుగుపెట్టగానే ఏం చేశారంటే?
ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్‌పై చంచల్‌గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. గత కొద్ది రోజుల క్రితం మహిళా కోరియోగ్రాఫర్ తాను మైనర్ బాలికగా ఉన్నప్పుడు తనపై అత్యాచారం జరిపారనే ఆరోపణలపై కేసు నమోదు చేయగా.. ఆయనను విచారణకు పిలిచి నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసిన రిమాండ్‌కు తరలించారు. అయితే తన తల్లి గుండెపోటుకు గురికావడంతో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా ఆయనకు హైకోర్టు మంజూరు చేసింది. ఆ వివారాల్లోకి వెళితే..
గురువారం రోజున జానీ మాస్టర్‌కు బెయిల లభిస్తే ఆయన జైలు నుంచి రిలీజ్ కావడానికి రెండు రోజులు పట్టింది. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన వాహానాన్ని మీడియా వెంటాడింది. కారులో జనసైనికులు వాడే ఎరుపు రంగు కండువాను మెడచుట్టూ వేసుకొని.. నన్న వదిలేయండి.. అంటూ చేతులెత్తి మీడియాను వేడుకొన్నారు.

హల్దీ వేడుకలలో శోభితా ధూళిపాల..ఫ్యాన్స్‌కి షాకిచ్చిన నాగచైతన్య ఫియాన్సీ
ఇంటిలోకి వచ్చిన జానీ మాస్టర్‌ను చూసిన భార్య సుమలత ఎమోషనల్ అయ్యారు. ఆయనను అలా చూస్తూ నిలిచి ఉండిపోయారు. దాంతో ఆమెను తన కౌగిలోకి తీసుకొని ముద్దులు పెట్టాడు. తలను ప్రేమతో నిమురుతూ నుదుటిపై కిస్ చేశాడు. అలా తన పిల్లలను, భార్యను కౌగిలించుకొని ఉద్వేగానికి లోనయ్యారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది.
ఇదిలా ఉండగా, జానీ మాస్టర్ నృత్యాలు సమకూర్చిన బాలీవుడ్ చిత్రం బూల్ బులయ్య వచ్చే వారం రిలీజ్ కానున్నది. అయితే జైలు నుంచి విడుదలయ్యాక ఆయన ఆ సినిమాలోని టైటిల్ ట్రాక్ గురించి ట్వీట్ చేశారు. టైటిల్ ట్రాక్‌ను ట్రెండింగ్‌లో ఉంచినందుకు ఆయన చిత్ర యూనిట్‌కు థ్యాంక్స్ చెప్పారు. ట్రాక్ బిహైండ్ ది సీన్ వీడియోను షేర్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకొన్నారు.


Click it and Unblock the Notifications











