ఎన్టీఆర్ డిజాస్టర్ మూవీ రీ రిలీజ్.. ఈ సారి గట్టిగానే కొట్టేలా ప్లాన్
టాలీవుడ్‌లో కొంత కాలంగా మూవీల రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది స్టార్ హీరోలు నటించిన సినిమాలు 4K ప్రింట్లతో ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటన్నింటికీ వాళ్ల వాళ్ల ఫ్యాన్స్ నుంచే కాకుండా సామాన్య సినీ ప్రియుల నుంచి కూడా రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇప్పుడు కూడా చాలా చిత్రాలు భారీ వసూళ్లను రాబట్టాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు నందూమరి ఫ్యామిలీకి చెందిన జూనియర్ ఎన్టీఆర్ వంతు వచ్చింది. తాజాగా అతడి అభిమానులు ఖుషీ అయ్యే అదిరిపోయే ప్రకటన వెలువడింది.
'సింహాద్రి' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రమే 'ఆంధ్రావాలా'. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీ విడుదలకు ముందు ఎంతో హైప్‌ను క్రియేట్ చేసుకుంది. అంతేకాదు, ఈ సినిమా ఆడియో రిలీజ్ కోసం చేసిన ఏర్పాట్లు తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అయితే, ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా మాత్రం ఘోర పరాజయాన్ని చవి చూసింది. తద్వారా ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత చెత్త సినిమాల్లో ఒకటిగా చెడ్డ పేరును మూటగట్టుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు.

తెలుగులో ఇప్పటి వరకూ గతంలో సూపర్ హిట్ అయిన చిత్రాలనే రీ రిలీజ్ చేశారు. కానీ, ఇప్పుడు డిజాస్టర్ అయిన ఎన్టీఆర్ 'ఆంధ్రావాలా'ను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని మార్చిలోనే ఎంతో గ్రాండ్‌గా రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని ప్రకటించారు. అంతేకాదు, కొన్ని కొత్త పోస్టర్లను కూడా విడుదల చేశారు. ఇదిలా ఉండగా.. ఇదే నెలలో 'అదుర్స్' మూవీ స్పెషల్ షోలు వేశారు. అలాగే, నందమూరి బాలకృష్ణ నటించిన 'సింహా' సినిమాను మార్చి 11వ తేదీన రీ రిలీజ్ చేస్తున్నారు. వీటితో పాటు RRR మూవీని కూడా మార్చి 10న విడుదల చేస్తున్నారు.

ఇక, 'ఆంధ్రావాలా' సినిమాను పూరీ జగన్నాథ్ తెరకెక్కించాడు. ఇందులో ఎన్టీఆర్ సరసన రక్షిత, సంఘవి నటించారు. ఈ చిత్రానికి చక్రీ సంగీతాన్ని అందించారు. ఈ మూవీని శ్రీ భారతి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై గిరి ఆర్ఆర్ వెంకట్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.


Click it and Unblock the Notifications











