Jr NTR దేవర రిలీజ్ వాయిదా? నందమూరి ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ షాక్!

సిద్దూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నేహా శెట్టి అతిథి పాత్రలో నటించిన చిత్రం టిల్లు స్క్వేర్. నాగవంశీ నిర్మాతగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అద్బుతమైన విజయాన్ని అందుకొన్నది. ఈ సినిమా సక్సెస్‌ మీట్ హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో జరిగింది. ఈ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో విశ్వక్ సేన్, త్రివిక్రమ్ శ్రీనివాస్, చిత్ర యూనిట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా యంగ్ టైగర్ మాట్లాడుతూ..

సిద్దూ, విశ్వక్ సేన్‌పై నాకు నమ్మకం ఉంది. నేను ఎప్పుడూ మీ ఇద్దరిపై నమ్మకం ఉందని చెబుతుంటాను. అలాగనే నేను అని భావించకండి. ఇండస్ట్రీకి మీ ఇద్దరి అవసరం ఉంది. ఇండస్ట్రీ ముందుకు వెళ్లడానికి ఉపయోగపడుతారు. పరిశ్రమకు కొత్త ఐడియాలతో ముందుకు తీసుకెళ్లాడానికి మీ లాంటి డేర్ డెవిల్స్ అన్నారు. మీ ఇద్దరు కృషి ఇండస్ట్రీకి అవసరం ఉంది. హ్యాట్సాఫ్ మీ ఇద్దరికి అని ఎన్టీఆర్ అన్నారు.

Family Star 4 Days Collections విజయ్ దేవరకొండకు కోలుకోలేని దెబ్బ.. ఫ్యామిలీ స్టార్ నష్టాల్లో నుంచి బయటపడాలంటే?

Jr NTR Hints Devera Release may delayed at Tillu Square Success meet

నాకు బలగం సినిమాలో ఊరు పల్లెటూరు పాట అంటే ఇష్టం. కాసర్ల శ్యామ్ రాసే పాటల్లో మట్టి వాసన ఉంటుంది. ఆయనకు అజ్జుకు ధన్యవాదాలు. ఈ సినిమాలో పనిచేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఈ సినిమాలో రాధిక, లిల్లీ క్యారెక్టర్లకు నేహా శెట్టి, అనుపమ బాగా చేశారు. టిల్లుకు ఉండే బలహీనత వల్ల సినిమా బ్రహ్మండగా వర్కవుట్ అయింది అని చెప్పారు.

దేవర సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ఈ సినిమాలో భయం గురించి మాట్లాడటం జరుగుతుంది. కల కనడానికి ధైర్యం ఉండాలి. కల కనడానికి ఒక ధైర్యాన్ని, ఆ కలను, ధైర్యాన్ని సార్థకత చేకూర్చడానికి భయం ఉండాలి. కుదిరితే నన్ను సరిదిద్దండి. లేదా క్షమించండి. కానీ నేనున్నాని గుర్తించండి అని ఎన్టీఆర్ అన్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్‌ను చూస్తూ అదిరిపోయిందిగా అని అన్నాడు. ఆయనను చూసి చాలా రోజులైంది. ఈ స్టేజ్ మీద ఉంటే నాకు మళ్లీ అరవింద సమేత గుర్తుకు వస్తున్నది అని అనగానే వెంటనే వచ్చి తారక్‌ను తివ్రిక్రమ్ కౌగిలించుకొన్నాడు.

https telugu filmibeat com tamil anirudh-ravichander-comments-about-his-first-love-with-singer-andrea-jeremiah-136049 html

కొంచెం ఓవర్ కాదనుకొంటే.. ఓ విషయం చెబుతాను. ఈ రోజు చొక్కా వేసుకొని వచ్చాను. చొక్కాకు కాలర్ ఉంది. దేవర అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే.. మీ అందరూ కాలర్ ఎగురేసుకొనే విధంగా సినిమాను ప్రేక్షక దేవుళ్లకు అందించే విధంగా మేము ప్రయత్నిస్తాం అని ఎన్టీఆర్ అన్నారు. దాంతో ఈ సినిమా రిలీజ్ లేట్ అవుతుందని వార్తలకు యంగ్ టైగర్ వివరణ ఇచ్చారు.

తెల్లవారితే ఉగాది పండగా. అందరికి నా పండగ శుభాకాంక్షలు. మీరందరూ ఈ ఆనందాన్ని ఇంటి వరకు తీసుకెళ్లాలి. మీ కోసం మీ ఇంటిలో అమ్మ, నాన్న, అక్కా, అన్న, మీ కుటుంబ సభ్యులు అందరూ వేచి ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి అని ఎప్పటీలానే తారక్ తన సందేశాన్ని ఇచ్చారు.

https telugu filmibeat com tamil anirudh-ravichander-comments-about-his-first-love-with-singer-andrea-jeremiah-136049 html

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ రూపొందిస్తున్న దేవర చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతున్నది. ఈ సినిమా గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాలేకపోవడం వల్ల రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తన అభిమానులకు ఎన్టీఆర్ ఈ వేదిక ద్వారా హింట్ ఇచ్చాడనేది సినీ వర్గాల అభిప్రాయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X