twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంగ్లీ వివాదంలో ఎంట్రీ ఇచ్చిన కరాటే కళ్యాణి.. సిరివెన్నల, తనికెళ్ళ భరణిని లాగుతూ సంచలన వ్యాఖ్యలు!

    |

    సింగర్ మంగ్లీ పాడిన బోనాలు పాట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పాటలో లిరిక్స్ దేవతను కించపరిచే విధంగా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారం మీద మంగ్లీ స్పందించి క్షమాపణ చెప్పింది. అయితే తాజాగా ఈ వివాదంలో ఎంట్రీ ఇచ్చిన కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

     మంగ్లీ మీద ఫిర్యాదు

    మంగ్లీ మీద ఫిర్యాదు

    పండుగల సందర్భంగా మంగ్లీ పాడిన ప్రత్యేక గీతాలు విడుదల అవుతూ ఉంటాయి. ఈ నెల 11న మంగ్లీ పాడిన బోనాల పాట విడుదల అయింది. ఈ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. 'చెట్టు కింద కూసున్నవమ్మా.. సుట్టం లెక్క ఓ మైసమ్మా' అంటూ ఈ పాట సాగుతూ ఉంటుంది. అయితే ఈ పాట లిరిక్స్ హిందూ దేవతలను కించపరిచేలా ఉందని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో సింగర్ మంగ్లీపై బీజేపీ కార్పొరేటర్లు రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు.

    కళ్యాణి సంచలనం

    కళ్యాణి సంచలనం

    ఇక ఈ విషయం గురించి మాట్లాడుతూ కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు.మాయదారి మైసమ్మ అన్నప్పుడు ఏడికోయినవ్ చుట్టం లెక్కా మోతుబరిగంటే కేసులా ? సిగ్గుపోతుంది, నిందా స్తుతి కూడా తెల్వనోల్లకి చెప్పుడేతప్పు అని పేర్కొన్నారు.

    Mangli : పాట మారుద్దామనుకున్నా కానీ, వాళ్ళు కూడా నా జాతి గురించి మాట్లాడతారా, గుడికట్టించా.. !

    చించేసుకుంటున్నరు

    చించేసుకుంటున్నరు

    ఈ విషయం అందరూ ఆలోచించాలన్న ఆమె మంగ్లి పాటలో చుట్టంలెక్క వో మైసమ్మ..అంటే మనవాళ్ళు చించేసుకుంటున్నరు, నాకు ఇంతవరకు పోస్ట్ పెట్టడానికి అవకాశం లేదు అందరూ కవి భావం అర్థం చేసుకోవాలి..అది నిందా స్తుతి అని కరాటే కళ్యాణి పేర్కొన్నారు.

    గొడవ పడాలి అంటే

    గొడవ పడాలి అంటే

    మనం అలా అనాలి అంటే గొడవ పడాలి అంటే ముందు వేటూరి గారు సిరివెన్నెల గారు అలాగే తనికెళ్ళ భరణి గారు ఇలా చలా మందిని ప్రశ్నించాలని అన్నారు. ఇక్కడ కవి రాసిన దానికి తనగాత్రం తోపాటు అటా కూడా జోడించి న ఒక ఆడపిల్ల నీ ఇన్ని మాటలు ఎలా అంటున్నారు... సంస్కృతి సంప్రదాయాలు అంటే మాయదారి మైసమ్మ అన్నప్పుడు మనం ఏమైపోయం ? అని ఆమె ప్రశ్నించారు.

    వివాదంలో చిక్కుకున్న సింగర్ మంగ్లీ.. ఆఫ్రికన్ తో బోనాల పాట, కొత్త టెన్షన్!వివాదంలో చిక్కుకున్న సింగర్ మంగ్లీ.. ఆఫ్రికన్ తో బోనాల పాట, కొత్త టెన్షన్!

    అది తప్పు కాకుంటే ఇది తప్పు కాదు

    అది తప్పు కాకుంటే ఇది తప్పు కాదు

    మనం ఆ పాటలకు డాన్స్ లేకుండా ఏదైనా పండగ చేసుకొం, అది తప్పు కాకుంటే ఇది తప్పు కాదు మళ్ళీ కేసులు కూడా పెట్టారు అంట పాపం వాళ్ళు పాట మార్చి పెడితే ఇదేదో విజయం సాధించిన వాళ్ళలాగా పోస్ట్ లు పెట్టుకోవడం ... మీకుఏమన్నా అర్థం.అవుతుందా ? అని ఆమె ప్రశ్నించారు..

    Recommended Video

    Karate Kalyani About Jr NTR Real Behavior || Filmibeat Telugu
    మంగ్లీకి నేను సపోర్టు చేస్తా

    మంగ్లీకి నేను సపోర్టు చేస్తా

    ఇలాంటివాటిని పక్కనపెట్టి గో హత్యలు జరిగితే మాట్లాడరు?..వాటిమీద.పోరాటం చెయ్యరు ? ఏదన్నా జరిగితే మనకెందుకులే అనుకుంట ఉండే కొంతమంది హిందువులు..ఇప్పుడు హిందుత్వంకి చేటు వాటిల్లింది....అంటుంటే నవ్వు వస్తుంది మంగ్లీకి నేను సపోర్టు చేస్తా ...మీరు చేస్తున్నారా చుట్టం లెక్కా ఓ మైసమ్మకి అంటూ ఆమె ప్రశ్నించారు.

    English summary
    Mangli releases a special song every year during the Bona festival. In the same vein, Bonal’s special song released this year is also shaking up YouTube. However, some netizens have criticized the controversy. now Karate Kalyani extended her support to Singer Mangli over bonalu song controversy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X