Don't Miss!
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
క్రేజీ కాంబినేషన్... మొదటిసారి కలవబోతున్న అనుష్క, విజయ్ దేవరకొండ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఎదో ఒక కొత్త పాయింట్ ఉంటుంది. ఇక ఆమె ఇటీవల రిలీజ్ చేసిన నిశ్శబ్దం సినిమా ఎందుకో అనుకున్నంత స్థాయిలో వర్కౌట్ కాలేదు. థియేటర్స్ లో రిలీజ్ కావాల్సిన ఆ సినిమా లాక్ డౌన్ కారణంగా ఓటీటీ వరల్డ్ విడుదలైన విషయం తెలిసిందే. ఒక విధంగా సినిమా ప్రాఫిట్ జోన్ లోనే పడినట్లు టాక్ అయితే వస్తోంది.
భవిష్యత్తు ప్రాజెక్టులపై క్లారిటీ ఇచ్చిన అనుష్క
అసలు మ్యాటర్ లోకి వస్తే ఇటీవల ట్విట్టర్ వరల్డ్ లోకి వచ్చిన అనుష్క శెట్టి అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అనేక విషయాలపై స్పందించిన స్వీటీ తన భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. రెండు సినిమాలకు ఇది వరకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని ఆ సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు తెలిపింది. కానీ ఎవరితో వర్క్ చేస్తోంది అనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు.
క్రేజీ కాంబినేషన్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటిసారి ఒక క్రేజీ కాంబినేషన్ వెండితెరపైకి రానున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, అనుష్క శెట్టి ఒక సినిమాకు కలిసి వర్క్ చేయనున్నారట. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను పక్కనపెట్టి కాస్త కొత్తగా అడుగులు వేస్తున్న అనుష్క ఇటీవల ఓకే చేసిన రెండు ప్రాజెక్టులలో ఒకటి విజయ్ దేవరకొండ సినిమానే అని తెలుస్తోంది.
వయసులో చిన్నవాడైన హీరోతో..
గతంలో ఎప్పుడు లేని విధంగా అనుష్క విజయ్ దేవరకొండతో కలిసి నటించబోతున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతోంది. వయసులో అనుష్క కంటే విజయ్ ఏడేళ్లు చిన్నవాడు. అలాంటి హీరోతో అనుష్క ఎలాంటి పాత్ర చేయనుంది అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక వీరి సినిమాను ఒక బడా నిర్మాణ సంస్థ నిర్మిస్తుండగా కొత్త దర్శకుడు డైరెక్ట్ చేయనున్నారట.
Recommended Video
తెరపైకి వచ్చేది ఎప్పుడంటే..
ఇక నిశ్శబ్దం సినిమా అనంతరం నెక్స్ట్ సినిమా విషయంలో సైలెన్స్ మెయింటైన్ చేస్తున్న అనుష్క ఆ సినిమాలను వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని చూస్తోంది. ఇక మరోవైపు విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ తో ఫైటర్ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఆ సినిమాపై అంచనాకు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక అనుష్క, విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది తెరపైకి వచ్చే అవకాశం ఉందట..