‘లైగర్ డిజాస్టర్‌తో డిప్రెషన్‌లోకి.. పీకల్లోతు అప్పులతో దారుణంగా రోడ్డున పడి..’

తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలకు, డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు మధ్య తీవ్ర గందరగోళం ఏర్పడింది. రెంట్ విధానం కొనసాగించడం వల్ల సింగిల్ థియేటర్లకు లబ్ది చేకూరడం లేదు. ఎగ్జిబిటర్లు నష్టపోతున్నారు. డిస్టిబ్యూటర్ల వ్యవస్థ కూడా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. తెలంగాణలో చాలా వరకు సింగిల్ థియేటర్లు మూతపడుతున్నాయనే విషయం నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు మధ్య వివాదం చోటు చేసుకొన్నది.

ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీలోని డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల పరిస్థితిపై ఏషియన్ గ్రూప్ అధినేత, డిస్టిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, నిర్మాత సునీల్ నారంగ్ ఇటీవల గుల్తేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఒక సినిమా డిజాస్టర్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని కళ్లకు కట్టినట్టు చెప్పారు. ఆయన సినిమా పరిశ్రమలో ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న సమస్య గురించి మాట్లాడుతూ...

Liger Disaster Controversy

ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ పరిస్థితి బాగా లేదు. గతంలో ఏదైనా సినిమా ఫ్లాఫ్ అయితే నష్టాలు లక్షల్లో ఉండేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఏదైనా మూవీ ఆడకపోతే 20 నుంచి 30 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. డిస్టిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు పెద్ద రిస్క్ ఉంది. అందుకే ఎవరూ కూడా సినిమాలు కొనడానికి ముందుకు రావడం లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం నిర్మాతలకు అగ్రిమెంట్ ఇవ్వడమనేది కష్టంగా ఉంది. అప్పుల బారిన పడితే డబ్బు తెచ్చి కట్టడం కష్టంగా ఉంది. అందుకే సేఫ్‌గా మేము ఆరుగురం కలిసి డిస్టిబ్యూషన్ చేస్తున్నాం. వివేక్, అనిల్, రిలయన్స్, సురేష్ బాబు, అభిషేక్ అగర్వాల్, ఏషియన్ సంస్థలు కలిసి బిజినెస్ చేస్తున్నాం. రిస్క్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసుకొంటున్నాం అని అన్నారు.

విజయ్ దేవర కొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన లైగర్ సినిమా డిజాస్టర్ చాలా మందిని నష్టాలకు గురి చేసింది. వరంగల్ శ్రీను అనే డిస్ట్రిబ్యూటర్ అంతకు ముందు ఆచార్య సినిమాను కొన్నారు. ఆ సినిమా ఫ్లాప్ కావడం, వెంటనే లైగర్ కూడా డిజాస్టర్ కావడం ఆయన చేతులు ఎత్తేశాడు. లైగర్ సినిమా హిట్ అని పూరీ జగన్నాథ్, చార్మీ చెప్పడంతో వరంగల్ శ్రీను నైజాం, ఆంధ్రా ఏరియాల డిస్ట్రిబ్యూషన్ చేశారు. అప్పటికీ మేము రిస్క్ చేస్తున్నావని హెచ్చరించాం. కానీ ఆయన మా మాట వినలేదు. డిజాస్టర్ సినిమా ఫ్లాప్ తర్వాత ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లారు. ఆయన ఎవరికి కనిపించకుండా పోయారు. దాంతో ఎగ్జిబిటర్లకు న్యాయం చేసేందుకు నేను రంగంలోకి దిగాల్సి వచ్చింది అని చెప్పారు.

ఎగ్జిబిటర్లు ధర్నాకు దిగడం, నష్టపోవడంతో నా మనసు కలిచి వేసింది. ఆ క్రమంలో పూరీ జగన్నాథ్ చర్చలు జరిపితే.. కొంత మొత్తం ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే ఆ డబ్బును నేరుగా ఎగ్జిబిటర్లకు చెల్లించమని కోరాను. అప్పట్లో ఛాంబర్ ప్రసిడెంట్‌గా నా బాధ్యతను నెరవేర్చేందుకు ప్రయత్నించాను. లైగర్ వివాదం సద్దుమణగడం వెనుక ప్రసన్న కుమార్ రోల్ ఎక్కువగా ఉంది. మానవత్వంతో వ్యవహరించి ఒకరికొకరు సహకరించుకొంటే పరిశ్ర నిలబడుతుందని ఆయన అన్నారు. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుత వివాదం నేపథ్యంలో వైరల్ అవుతున్నది.

Read more about: liger puri jagannadh sunil
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X