LIGER Time Table: వరుసగా మూడు రోజులు పవర్ఫుల్ అప్డేట్స్.. అసలైన న్యూ ఇయర్ బ్లాస్ట్!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి రాబోతున్న మరో పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా అభిమానుల అంచనాలను అందుకుంటుందని అందరిలో ఒక నమ్మకం అయితే ఉంది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ చిత్ర యూనిట్ చాలా పవర్ఫుల్ గా సిద్ధమైంది. రాబోయే మూడు రోజుల్లో గ్యాప్ లేకుండా అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

న్యూ ఇయర్ సందర్భంగా..

న్యూ ఇయర్ సందర్భంగా..

విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కలయికలో వస్తున్న ఈ మొట్టమొదటి సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో సక్సెస్ అవుతుంది అని చెప్పవచ్చు. సినిమాను బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, పూరి జగన్నాథ్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. మరొక నిర్మాతగా ఛార్మి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక న్యూ ఇయర్ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు అదిరిపోయే అప్ డేట్ ఇవ్వబోతున్నారు.

 మైక్ టైసన్.. పవర్ఫుల్ రోల్

మైక్ టైసన్.. పవర్ఫుల్ రోల్

పాన్ ఇండియా స్టార్ గా విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న మొట్ట మొదటి మూవీ కోసం రౌడీ ఫ్యాన్స్ అయితే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కూడా ఒక ఒక ప్రత్యేకమైన పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇండియాలో ఆయన నటిస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో అన్ని వర్గాల మాస్ ప్రేక్షకులలో కూడా సినిమా ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది.

బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్స్..

బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్స్..

మొదటగా డిసెంబర్ 29న ఉదయం 10:03 కి ఒక వీడియో ద్వారా అనౌన్స్మెంట్ చేయనున్నారు. అది తప్పకుండా అభిమానులకు ఎంతగానో నచ్చుతుందని ఇన్ని రోజులు ఎదురు చూసిన ఫ్యాన్స్ కు చిత్ర యూనిట్ సభ్యులు సరికొత్త కిక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 30వ తేదీన ఉదయం 10:03కి సినిమా షూటింగ్ సంబంధించిన బిహైండ్ ద సీన్స్ స్టిల్స్ కూడా విడుదల చేయబోతున్నారు. అదే రోజు నాలుగు గంటలకు స్పెషల్ ఇన్స్టా ఫిల్టర్ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది

ఫస్ట్ గ్లింప్స్ రెడీ..

ఫస్ట్ గ్లింప్స్ రెడీ..

రికార్డ్ డిసెంబర్ 31వ తేదీన అసలైన న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం లైగర్ యూనిట్ అద్భుతమైన ఫస్ట్ గ్లింప్స్ ను కూడా విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ రౌడీ అభిమానుల చేత పాలాభిషేకం చేయించుకుంది. ఇక ఇప్పుడు ఫస్ట్ గ్లింప్స్ వస్తే వారి ఆనందాలకు హద్దులు ఉండవు అని చెప్పాలి. ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న అసలైన అప్డేట్ రోజు రౌడీ స్టార్ ఫాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నారు.

 సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

గ్యాప్ లేకుండా వరుసగా మూడు రోజులపాటు సాలీడ్ అప్డేట్స్ తో చిత్ర యూనిట్ సినిమా పై ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుందనే చెప్పాలి. సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ 25న విడుదల చేయనున్నట్లు అఫీషియల్ గా మరో క్లారిటీ ఇచ్చారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళం కన్నడ హిందీ భాషల్లో కూడా లైగర్ భారీ స్థాయిలో విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X