Liger twitter review విజయ్ దేవరకొండ ఫెర్ఫార్మెన్స్ అదుర్స్.. ప్లస్, మైనస్‌లు ఇవే..

సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం లైగర్. అమెరికాతోపాటు ఓవర్సీస్‌లో బుధవారం రాత్రి ప్రీమియర్లు మొదలయ్యాయి. ఈ సినిమాపై సోషల్ మీడియాలో నెటిజన్లు వెల్లడించిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. మీ కోసం లైగర్ ట్విట్టర్ రివ్యూ..

పూరీ స్టాండర్ట్స్‌లో

లైగర్ సినిమా చూశాను. పూరీ స్టాండర్ట్స్‌లో సినిమా ఉన్నట్టు అనిపించలేదు. కానీ విజయ్ దేవరకొండ, పూరీ బ్లాక్ బస్టర్ కొట్టే అవకాశం ఉంది. క్లైమాక్స్ బాగుంది. విజయదేవరకొండ ఫ్యాన్స్‌కు బ్లాక్ బస్టర్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

లైగర్ సినిమా ఫస్టాఫ్ యావరేజ్

లైగర్ సినిమా ఫస్టాఫ్ యావరేజ్. ఎలివేషన్ సీన్లు, కొన్ని డైలాగ్స్ వర్కవుట్ అయ్యాయి. స్టోరి బాగున్నది. విజయ్ దేవరకొండ ట్రాన్స్‌ఫర్మేషన్ బాగుంది. నత్తి అతడికి సూట్ కాలేదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉంది.

ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉంది. సెకండాఫ్‌‌లో 40 నిమిషాలు బాగున్నది. మైక్ టైసన్‌ను సరిగా ఉపయోగించుకోలేదు. అనన్య కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. మాస్ ప్రేక్షకులు ఆదరిస్తే సినిమా హిట్ అవుతుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.

అనన్య పెర్ఫార్మెన్స్

లైగర్ సినిమా మీ సహనాన్ని టెస్ట్ చేస్తుంది. అనన్య పెర్ఫార్మెన్స్ బాగాలేదు అని మరోనెటిజన్ కామెంట్ చేశాడు.

పుష్ప, సర్కారు వారీ పాట మాదిరిగానే

పుష్ప, సర్కారు వారీ పాట మాదిరిగానే నెగిటివ్‌ టాక్‌తో మొదలై బ్లాక్ బస్టర్‌గా లైగర్ మారుతుంది. సినిమా బ్లాక్ బస్టర్.. ఫేక్ అకౌంట్లతో చేసే ట్వీట్లు లైగర్‌ను ఏమీ చేయలేవు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

లైగర్ స్టోరీ లైన్ బాగాలేదు

లైగర్ స్టోరీ లైన్ బాగాలేదు. కథ ఊహించినట్టుగానే ఉంటుంది. మ్యూజిక్, నటీనటుల ఫెర్ఫార్మెన్స్ బాగుంది. అందరిని మెప్పించలేకపోవచ్చు అని లైగర్ సినిమా గురించి ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

లైగర్ సినిమా లండన్‌లో

లైగర్ సినిమా లండన్‌లో చూశాను. విజయ్ దేవరకొండ ఫెర్ఫార్మెన్స్, మాస్ యాక్షన్ సీన్లు, బీజీఎం, క్లైమాక్స్, రెండు పాటలు బాగున్నాయి. స్క్రీన్ ప్లే బాగా లేదు. సపోర్టింగ్ యాక్టర్లు కూడా అంత గొప్పగా లేరు. సినిమా ఒకసారి చూడొచ్చు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

లైగర్ మూవీ ఒకే యాక్షన్ మూవీ

లైగర్ మూవీ ఒకే యాక్షన్ మూవీ. విజయ్ దేవరకొండ సూపర్‌గా ఉన్నాడు. రమ్యకృష్ణ, మైక్ టైసన్ ఎఫిక్టివ్ రోల్స్‌లో కనిపించారు. అనన్య పాండే సినిమాకు మైనస్. సాంగ్స్ బాగాలేవు. బీజీఎం బాగుంది. స్టోరి, స్క్రీన్ ప్లే బాగాలేదు. యాక్షన్ సీన్లు బాగున్నాయి. నా రేటింగ్ 3 అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్.

లైగర్ సినిమా మంచి మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. ఫస్టాఫ్ కొంత స్లో అనిపిస్తుంది. కానీ ఇంకా బాగా తీసి ఉండాల్సింది. మాస్ ప్రేక్షకులకు విందు భోజనం. సాధారణ ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది. నా రేటింగ్ 3.25 అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

ఇంట్రడక్షన్ సీన్లు బాగున్నాయి.

మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్‌ మాదిరిగా ఇంట్రడక్షన్ సీన్లు బాగున్నాయి. బ్రూస్ లీకి నివాళిలా ఉంది. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండకు బెస్ట్ ఇంట్రడక్షన్ సీన్. పూరీ రాసిన కథ బాగున్నది. బీజీఎం అదరగొట్టింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

లైగర్ యావరేజ్ సినిమా.

లైగర్ యావరేజ్ సినిమా. సెకండాఫ్ కొంత బాగాలేదు. స్క్రీన్ ప్లే బాగాలేదు. క్లైమాక్స్ బాగాలేదు. విజయ్ దేవరకొండ నత్తి బాగా లేదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

లైగర్ కథాపరంగా బాగాలేదు

లైగర్ కథాపరంగా బాగాలేదు. విజయ్ దేవరకొండ ట్రాన్స్‌ఫర్మేషన్ బాగుంది. నత్తి అతడికి సూట్ కాలేదు. హీరోయిన్ సినిమాకు మైనస్. కొన్ని సీన్లు మాత్రమే బాగున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X