Liger: విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ ఎదురుపడితే ఇలా ఉంటుందా.. వైరల్ పిక్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వరుసగా పాన్ ఇండియా సినిమాలు తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. మన స్టార్ హీరోల వ్యాల్యూ రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరిగే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది. విజయ్ దేవరకొండ కూడా రానున్న రోజుల్లో ఇండియన్ స్టార్ హీరోగా క్రేజ్ అందుకుంటారు అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. నిజానికి విజయ్ కష్టాన్ని చుస్తే త్వరలోనే ఆ ఘనతను సాధించగలడని చెప్పవచ్చు.

ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న లైగర్ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు సంబంధించిన మరొక ఫోటోను చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. అందులో మైక్ టైసన్ విజయ్ దేవరకొండ ఫేస్ టు ఫేస్ ఎదురుపడ్డారు.

రెగ్యులర్ ప్రమోషన్..

రెగ్యులర్ ప్రమోషన్..

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాపై ప్రేక్షకుల్లోనే కాకుండా సినీ ప్రముఖుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు అయితే క్రియేట్ అయ్యాయి. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని ఇప్పటికే బాలీవుడ్ మీడియాలో కూడా కొన్ని కథనాలు వెలువడ్డాయి. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసి రెగ్యులర్ ప్రమోషన్ ను మొదలు పెట్టాలని అనుకుంటున్నారు.

మొదటిసారి ఇండియన్ సినిమాలో

మొదటిసారి ఇండియన్ సినిమాలో

లైగర్ సినిమా లో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైజన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. మైక్ టైసన్ మొదటిసారి ఒక పాన్ ఇండియన్ సినిమాలో కనిపించబోతున్నాడు అనగానే ప్రేక్షకుల్లో ఒక్కసారిగా అంచనాల స్థాయి ఆకాశాన్ని దాటేసింది. గతంలో ఈ బాక్సింగ్ లెజెండ్ కు చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ అతను బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు కూడా పెద్దగా ఫోకస్ చేయలేదు కానీ పూరి జగన్నాథ్ చెప్పిన కాన్సెప్ట్ అతనికి బాగా నచ్చడంతో వెంటనే ఒప్పేసుకున్నాడు.

నవ్వుతూ కనిపించిన లెజెండ్, లైగర్

నవ్వుతూ కనిపించిన లెజెండ్, లైగర్

మైక్ టైసన్ పాత్ర కూడా సినిమాలో చాలా పవర్ఫుల్ గా చూపించబోతున్న పూరి జగన్నాథ్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నట్లు అర్థమవుతుంది. ఇక విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ ఎదురు పడితే ఎలా ఉంటుంది అనే ఫోటో ను ఇటీవలే విడుదల చేసారు. వారిద్దరు ఎదురెదురుగా నవ్వుతూ కనిపించారు. అయితే ఇది కేవలం ఆఫ్ స్క్రీన్ మాత్రమే. వెండితెరపై మాత్రం ఇద్దరూ కూడా చాలా సీరియస్ లుక్ తో కనిపిస్తారని తెలుస్తోంది. తప్పకుండా హై వోల్టేజ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు.

Recommended Video

Liger - Boxing Legend Mike Tyson In Vijay Deverakonda's Liger
యూఎస్ షెడ్యూల్

యూఎస్ షెడ్యూల్

ప్రస్తుతం పూరి జగన్నాథ్ చిత్ర యూనిట్ తో కలిసి అమెరికా వెళ్లాడు. అక్కడ మైక్ టైసన్ అలాగే విజయ్ దేవరకొండ కు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ మైక్ టైజన్ ఎదురుపడిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నారు. ఒక ఫోటో అయితే సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది.

తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో పూరి జగన్నాథ్ తో కలిసి చార్మి అలాగే కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ లో కూడా సినిమా స్థాయి పెరిగే విధంగా ప్రమోషన్ చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X