40 ప్లస్‌లోనూ ఇంకా సింగిల్‌గానే... పెళ్లిపై నందినీ రెడ్డి షాకింగ్ కామెంట్స్

సమంత నటించిన మా ఇంటి బంగారం మూవీ భారీ వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమా సందడి నేపథ్యంలో ఈ చిత్ర దర్శకురాలు నందినీ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సమంతతో పాటు ఈమె కూడా ప్రమోషనల్ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అతికొద్దిమంది మహిళా దర్శకులలో ఆమె కూడా ఒకరు. అయితే ఇప్పటికీ నందినీ రెడ్డి బ్యాచిలర్‌ కావడం గమనార్హం. 46 ఏళ్లు వచ్చినప్పటికీ సోలోగానే లైఫ్ లీడ్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి నందినీ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

చిత్తూరు జిల్లాకు చెందిన నందినీ రెడ్డి హైదరాబాద్, న్యూఢిల్లీలలో చదవుకున్నారు. సినిమాలపై ఆసక్తితో ప్రముఖ దర్శకుడు గుణ్ణం గంగరాజు దర్శకత్వంలో వచ్చిన లిటిల్ సోల్జర్స్‌కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు నందినీ రెడ్డి. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ ఆమెను కృష్ణవంశీకి పరిచయం చేశారు. ఆయన వద్ద దర్శకత్వంలో మరిన్ని మెళకువలు నేర్చుకున్న నందినీ రెడ్డి 2011లో అలా మొదలైందిని తెరకెక్కించారు. తర్వాత జబర్దస్త్, కళ్యాణ వైభోగమే, ఓ బేబీ, పిట్ట కథలు, అన్నీ మంచి శుకునములే ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమాలను తెరకెక్కించారు నందినీ రెడ్డి.

Maa Inti Bangaram Director Nandini Reddy Opens Up About Marriage and Her Crush on Prabhas

అయితే ఇప్పటికీ బ్యాచిలర్‌గా ఉండటంపై నందినీ రెడ్డిని పలుమార్లు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తనదైన శైలిలో ఆమె ఆన్సర్ ఇచ్చారు. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నందినీ రెడ్డికి ఇదే ప్రశ్న ఎదురైంది. ప్రభాస్ గారు పెళ్లి చేసుకున్న వెంటనే చేసుకుంటాను. నా క్రష్ ఆయనే. ప్రభాస్ గారిని నా ముందుకు తీసుకొస్తే సిగ్గుపడతానేమో. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఎక్కువగా ఆడేదానిని, చీరలు కట్టుకోవడం లేదని చాలామంది అడుగుతారు కానీ నాకు అంత ఓపిక లేదు. గుండెల్లో గంట మోగలేదా అంటే ఇటలీలో అబ్బాయిలు చాలా బాగుంటారు, ఇండియాలో ప్రభాస్ గారు చాలు అని నందినీ రెడ్డి తెలిపారు.

మరో ఇంటర్వ్యూ.. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో నందినీ రెడ్డి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి రాకుండా మెడిసిన్ వైపు వెళ్తే బాగుండేదని అనుకునేదానిని, కానీ ఎవరైనా ప్రొడ్యూసర్ నా కథకు ఓకే చెప్పగానే మళ్లీ సినిమాపై కసి పెరిగేది. డైరెక్టర్‌గా ఛాన్స్ వరకు ఖర్చుల కోసం రేడియో జాకీగా కూడా పనిచేశాను. నెలకు 20 వేల వరకు వచ్చేది, టూ వీలర్‌కు పెట్రోల్ పోయించగా బాగానే మిగిలేది. అలా మొదలైంది సినిమాకు 5 లక్షల రూపాయలు.. ఆ మూవీ తమిళ్ రైట్స్ అమ్మిన తర్వాత 20 లక్షలు ఇచ్చారు. అమ్మకి 10 లక్షలు అప్పు ఉండటంతో ఇంటి మీదకి రౌడీలను పంపేవారు. నేను నిర్మాత దగ్గర డబ్బులు తీసుకున్న వెంటనే ఫస్ట్ అతనికే ఇచ్చేశానని నందినీ రెడ్డి గుర్తుచేసుకున్నారు.

స్పోర్ట్స్ ఎక్కువ ఆడటంతో పాటు చిన్నప్పటి నుంచి అబ్బాయిలతోనే తిరిగేదానిని. కానీ నా కంఫర్ట్ నాకు ముఖ్యం. ఈ విషయంలో మా నాన్నగారే ఆదర్శం. 20లలో ఉన్నప్పుడు నేను కూడా చీరలు కట్టుకున్నాను, ఫంక్షన్స్‌కి వెళ్లాను. కానీ క్రీడలలో ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం వల్ల చీర కంఫర్ట్‌గా ఉండేది కాదు. మేకప్ నచ్చదు.. లిప్‌స్టిక్ టేస్ట్ అస్సలు బాలేదు, పౌడర్ రాసుకుంటే అలర్జీలా అనిపించేదని నందినీ రెడ్డి అన్నారు.

ఇక పెళ్లి గురించి స్పందిస్తూ.. నేను పెళ్లి చేసుకుంటానని, చేసుకోనని ఖచ్చితంగా అనుకోలేదు. కాలేజీలో ఉన్నప్పుడు ప్రేమలు కూడా ఉన్నాయి. బహుశా ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడం వల్ల ఎవరినీ కనెక్ట్ కాలేకపోయా. నా ప్రేమ పెళ్లి వరకు దారి తీయలేదు. సినిమా ఇండస్ట్రీకి రావడం వల్ల అలాంటి పర్సన్‌ని నేను కలవలేదు. డైరెక్టర్ అనే జాబ్‌కి బాగా డిమాండ్ ఉండేది. మీ ప్రొఫెషన్‌ని, జాబ్‌ టైమింగ్స్‌ని అర్ధం చేసుకునే వ్యక్తి కావాలి. సినీరంగానికి వచ్చిన తర్వాత కూడా పెళ్లి సంబంధాలు వచ్చాయి, అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు.

అనుష్క రికార్డ్‌ను కొట్టలేకపోయిన సమంత... లేడీ సూపర్‌స్టార్స్‌లో జేజేమ్మ డామినేషన్!ఒక సినిమా చేశాక మానేస్తానని అనుకున్నారు. అయ్యో మనం పెళ్లి చేసుకోలేదే అన్న వెలితి నాకెప్పుడూ అనిపించలేదు. చిన్నప్పటి నుంచి ఒక గదిలో కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ ఉండేదానిని. ఫ్రెండ్స్ వస్తే ఫ్రెండ్స్‌తో గడుపుతాను, లేదంటే నాకు నేనుగా ఎంజాయ్ చేస్తాను. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్రెండ్స్‌తో రిఫ్రెష్ అవుతాను. వారిలోనూ స్కూల్, కాలేజ్ ఫ్రెండ్సే. ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారని నందినీ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X