Businessman: మహేశ్ సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్.. జెండా పాతేంగే అంటూ!
ఒకప్పుడు ఏదైనా స్పెషల్ డే ఉంటే పాత సినిమాలను మళ్లీ రిలీజ్ చేసేవాళ్లు. అది కూడా చాలా తక్కువ సంఖ్యలోనే ఇలాంటి సందర్భాలు కనిపించేవి. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం టాలీవుడ్‌లో రీ రిలీజ్ చిత్రాల హవా కనిపిస్తోంది. టాలీవుడ్‌లోని స్టార్ హీరోల పుట్టినరోజులనో, మరో స్పెషల్ డేనో పురస్కరించుకుని వాళ్ల వాళ్ల సూపర్ హిట్ సినిమాలను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎన్నో రకాల సినిమాలు మళ్లీ తెరపైకి వచ్చి ఓ రేంజ్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే.
ఈ మధ్య కాలంలో చాలా రీ రిలీజ్ చిత్రాలు కూడా కలెక్షన్ల వర్షం కురిపించి ఎన్నో అదిరిపోయే రికార్డులను సైతం క్రియేట్ చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబులోని మరో యాంగిల్‌ను చూపించి సక్సెస్ సాధించిన సినిమా కూడా రీ రిలీజ్ కాబోతుంది. అదే పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'బిజినెస్‌మేన్' మూవీ. ఈ చిత్రాన్ని మహేశ్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఆగస్టు 9వ తేదీన విడుదల చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు ఓ కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు - పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన 'బిజినెస్‌మేన్' మూవీని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ఫ్యాన్స్ సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు, దీన్ని ఏకంగా 300లకు పైగా స్క్రీన్లలో రీ రిలీజ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే ఈ సినిమా 4K ప్రింట్ వర్క్ కూడా పూర్తి అయింది. ఇక, ఈ సినిమా ట్రైలర్‌ను మరికొద్ది రోజుల్లోనే విడుదల చేయబోతున్నారు. దీంతో ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ 'జెండా పాతేంగే' అంటూ హడావిడి చేస్తున్నారు.
ఇక.. మహేశ్ బాబు హీరోగా నటించిన 'బిజినెస్‌మేన్' సినిమా 2012లో రిలీజ్ అయింది. పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించారు. ప్రకాశ్ రాజ్, నాజర్, బ్రహ్మాజీ, సుబ్బరాజు వంటి వాళ్లు కీలక పాత్రలు చేశారు. అప్పట్లో ఈ చిత్రం మాఫియా బ్యాగ్‌డ్రాప్ చిత్రాలకు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అంతేకాదు, మహేశ్ బాబు క్రేజ్‌ను, మార్కెట్‌ను కూడా పెంచేసింది.


Click it and Unblock the Notifications











