పూరి జగన్నాథ్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు.. అలా చేస్తే క్యారెక్టర్ లేనట్లే..!

పూరి జగన్నాథ్ - మహేష్ బాబు కాంబినేషన్ కోసం మరోసారి అభిమానులు గట్టిగానే ఎదురుచూస్తున్నారు. అయితే వీరి మధ్య గతంలో ఊహించని విదంగా మనస్పర్థలు రావడంతో కొంత గ్యాప్ వచ్చిందనే రూమర్స్ వచ్చాయి. పూరి జగన్నాథ్ కూడా మహేష్ బాబుతో మరోసారి సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ లేదని చెప్పకనే చెప్పాడు. అయితే రీసెంట్ గా మరోసారి పూరి గురించి మహేష్ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

 జనగణమన..?

జనగణమన..?

గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన పోకిరి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఆ తరువాత వచ్చిన బిజినెస్ మెన్ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే వీరి కాంబినేషన్ లో మరొక సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జనగణమన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వచ్చింది గాని పూరి సక్సెస్ ట్రాక్ లో లేకపోవడంతో మహేష్ నో చెప్పినట్లు టాక్ వచ్చింది.

ట్రాక్ లోకి వచ్చిన పూరి..

ట్రాక్ లోకి వచ్చిన పూరి..

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో సినిమా అంటే ఒకప్పుడు కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోల వరకు బాగానే ఇంట్రెస్ట్ చూపేవారు. ఐదేళ్ల ముందు వరకు పూరి సినిమాలు డిజాస్టర్ అయినా కూడా పెద్దగా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ వరుస అపజయాలు ఎక్కువవ్వడంతో ఆయనను ఎవరు పట్టించుకోలేదు. అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూరి మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఫ్యాన్స్ డైరెక్టర్..

ఫ్యాన్స్ డైరెక్టర్..

ఓ విదంగా హీరోల స్థాయిలో పూరి జగన్నాథ్ కూడా తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ని సెట్ చేసుకున్నాడనే చెప్పాలి. పూరి స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తే ఆ సినిమాలకు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. దాదాపు అందరి హీరోలతో పని చేయడంతో చాలా మంది పూరికి కూడా ఫ్యాన్స్ అయ్యారు. ఇక మహేష్ ఫ్యాన్స్ కూడా ఈ దర్శకుడిని చాలా లైక్ చేస్తారు.

పూరి కోసం వెయిటింగ్..

పూరి కోసం వెయిటింగ్..

రీసెంట్ గా మహేష్ బాబు అభిమానులతో ఇన్స్టాగ్రామ్ ద్వారా చాట్ చేయగా అందులో చాలా రకాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇక ఎక్కువ మంది అడగడంతో పూరి జగన్నాథ్ సినిమాతో ఎప్పుడనే సందేహంపై కూడా స్పంధించారు. తప్పకుండా ఆయనతో వర్క్ చేస్తానని పూరి గారు ఎప్పుడు కథ చెబుతారా అని వెయిట్ చేస్తున్నట్లు చెప్పాడు.

Recommended Video

Sarkaru Vaari Paata : Mahesh Babu New Look In Sarkaru Vaari Paata | SSMB 27
క్యారెక్టర్ పక్కనపెడితే..

క్యారెక్టర్ పక్కనపెడితే..

అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ మహేష్ బాబుతో మరోసారి సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ లేదని చెప్పకనే చెప్పాడు. ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు ఒప్పుకోలేదు. సక్సెస్ వచ్చాక ఆయనకు కథ చెప్పాలంటే.. నాకు కూడా ఒక క్యారెక్టర్ ఉందని అప్పట్లో పూరి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడం వైరల్ అయ్యింది. దీంతో ఇప్పుడు మహేష్ చేసిన కామెంట్ కి పూరి తన క్యారెక్టర్ ని పక్కనపెట్టి స్పందిస్తాడా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X