మహేష్ బాబు కోసం బిగ్ బడ్జెట్.. రాజమౌళి రిస్క్ చేస్తున్నాడా?
బాహుబలి అనంతరం ఒక్కసారిగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో బిగ్ బడ్జెట్ సినిమాల లెక్కలు మారాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా మన హీరోల కోసం వందల కోట్లు ఖర్చు చేయడానికి నిర్మాతలు డేర్ చేస్తున్నారు. రాజమౌళి కారణంగా మన సినిమాలు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో వసూళ్లు సాధిస్తాయని ఒక క్లారిటీ వచ్చేసింది. ఇకపోతే నెక్స్ట్ మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసం కూడా జక్కన్న హై బడ్జెట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు న్యూ స్టైలిష్ లుక్.. నలభై అంటే నమ్ముతారా?

డ్రీమ్ కాంబినేషన్..
మహేష్ బాబు చాలా కాలం నుంచి డైరెక్టర్ రాజమౌళితో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. మొత్తానికి ఒక కథ సెట్టవ్వడంతో మహేష్ ఫుల్ జోష్ లో కనిపిస్తున్నాడు. జేమ్స్ బాండ్ తరహాలో ఆ సినిమా ఉంటుందట. మహేష్ పాత్ర సీరియస్ గా ఉంటుందని ఇప్పటికే ఫిల్మ్ నగర్ లో ఒక టాక్ వినిపిస్తోంది.

ఆ రోజే అఫీషియల్ అప్డేట్..
మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్ పై జనాలకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినప్పటికీ చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఈ నెల 31న మహేష్ తన తండ్రి కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ అప్డేట్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయి. సినిమాను ఎనౌన్స్ చేసి ఆ తరువాత ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేయాలని దర్శకుడు ఆలోచిస్తున్నాడు.

బిగ్ బడ్జెట్..
మహేష్ బాబు సినిమాకు కూడా రాజమౌళి దాదాపు 300కోట్లకు పైగా ఖర్చు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే RRR కోసం 450కోట్లు కేటాయించిన జక్కన్న ఇప్పుడు సూపర్ స్టార్ ఒక్కడి కోసం మరొక హై బడ్జెట్ ని అనుకోవడం కాస్త రిస్క్ అనే చెప్పాలి. మహేష్ బాబుతో పాన్ ఇండియా సినిమా అంటే సౌత్ లో అంచనాలు భారీగానే ఉంటాయి. కానీ బాలీవుడ్ సైడ్ మహేష్ కి పెద్దగా మార్కెట్ లేదు. RRRలో అంటే ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు కాబట్టి ఒక స్పెషల్ ఎట్రాక్షన్ క్రియేట్ అయ్యింది.

రిస్క్ చేస్తున్నారా?
మహేష్ ఒక్కడి కోసమే 300కోట్లు ఖర్చు చేయడం ఎంతవరకు నిజమో తెలియదు గాని ఒక వేళ ఇది నిజమైతే.. మార్కెట్ పరంగా సినిమా మ్యాజిక్ చేస్తే గాని సేఫ్ జోన్ లో ఉండదు. అయితే రాజమౌళి అంత ఈజీగా రిస్క్ చేయడనేది అందరికి తెలిసిన విషయమే. మహేష్ కూడా నష్టాలు రాకుండా ఉండేందుకు జాగ్రత్త పడతాడు కాబట్టి.. వీరి కాంబినేషన్ పై వచ్చే రూమర్స్ లో నిజం ఉంటుందనే గ్యారెంటీ లేదు. కాబట్టి క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











