Bhuma Mounika: తొలిసారి బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసిన మంచు మనోజ్ భార్య.. ఎన్నో నెలంటే?
సినీ నటుడు మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిలు గతేడాది పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నో ఏళ్ల పాటు ప్రేమాయణం సాగించిన వీరు అనేక సమస్యలు దాటుకుని అందరినీ ఒప్పించుకునీ మరీ ఒక్కటయ్యారు. ముఖ్యంగా తన అక్క మంచు లక్ష్మీ సాయంతో ఆమె ఇంట్లోనే ఇద్దరూ కలిసి ఏడడుగులు వేశారు. అయితే పెళ్లై ఏడాది కూడా కాకముందే మౌనిక గర్భం దాల్చడంతో వీరు ఫుల్ సంతోషంలో ఉన్నారు. అయితే తాజాగా ఈమె తొలిసారి తన బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసింది. ఆ విషయాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మంచు మనోజ్ భార్య భూమా మౌనికకు ఇది రెండో పెళ్లి. గతంలో ఓ వ్యక్తితో పెళ్లి జరగడం, కొడుకు కూడా పుట్టాకా ఈమె ఆయనతో విడిపోవడం అందరికీ తెలిసిందే. అలాగే మంచు మనోజ్ కు కూడా ఇది వరకే పెళ్లి అయి విడాకులు అయ్యాయి. అయితే పెళ్లికి ముందు నుంచే స్నేహితులు అయిన మనోజ్, మౌనికలు.. ప్రేమలో పడ్డారు. చాలా ఏళ్ల పాటు వీరి బంధాన్ని సీక్రెట్ గానే ఉంచారు. కానీ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిన తర్వాత ఆ విషయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించే ప్రయత్నం చేశారు. అక్క సాయంతో అందరినీ ఒప్పించిన మనోజ్.. తన అక్క ఇంట్లోనే పెళ్లి కూడా చేసేసుకున్నాడు.

పెళ్లి అయిన తర్వాత.. మౌనిక కొడుకు.. తన కొడుకు అని ప్రకటించాడు. ఆ శివుడికి గణేషుడు ఎలా దొరికాడో తనకు కూడా తన కొడుకు అలాగే దొరికాడంటూ చెప్పుకొచ్చాడు. ఎక్కడికి వెళ్లినా భార్యతో పాటు కొడుకును కూడా తీసుకెళ్తూ.. చాలా హాయిగా ఉన్నారు. అయితే కొంత కాలం క్రితమే తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆ తర్వాత వీరిద్దరూ చాలా సార్లే బయట కనిపించినా మౌనిక బేబీ బంప్ మాత్రం సరిగ్గా కనిపించలేదు. కానీ తొలిసారి ఆమె తన బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసింది.
ఇన్ స్ట్గాగ్రామ్ అకౌంట్ వేధికగా తన భర్తతో కలిసి ఫొటో షూట్ చేయించుకున్న ఆమె షేర్ చేసింది. అందులో మౌనిక బ్లాక్ కలర్ లాంగ్ డ్రెస్ విత్ మేకప్ లో అదిరిపోయింది. అలాగే మనోజ్ కూడా వైట్ కలర్ షర్టు వేసుకుని భార్యతో కలిసి ఫొటోలు దిగాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యంగా తనలోని, తన పక్కన ఉన్న మనోజ్ తో తాను ఎప్పుడూ ప్రేమలో పడిపోతూనే ఉంటానని మౌనిక చెప్పుకొచ్చింది. అలాగే చాలా హాయిగా నవ్వుతూ ఫొటోలకు ఫోజులు ఇవ్వగా అందంగా కనిపిస్తోంది.
డైరెక్ట్‌గా OTTలోకి వచ్చేసిన సూపర్ క్రైమ్ థ్రిల్లర్.. డేర్ ఉంటే అక్కడ చూసేయండి!
ఈ ఫొటోలను తన కొడుకు ధైరవ్ తో పాటు భర్త మంచు మనోజ్ ను ట్యాగ్ చేసింది. ఇదంతా చూసిన మనోజ్.. పిల్లా ఓ పిల్లా నువ్వంటే నాకు ప్రాణమే అంటూ కామెంట్ చేశాడు. పెద్ద ఎత్తున అంతా స్పందిస్తూ కంగ్రాట్స్ అని చెబుతున్నారు. వీరిద్దరికీ 2023 మార్చి 3వ తేదీన పెళ్లి జరగగా.. మూడు నెలలకే ఆమె గర్భం దాల్చింది. ఆ విషయాన్ని నేరుగా మంచు మనోజ్ యే ప్రకటించారు. అయితే ప్రస్తుతం మౌనిక ఏడో నెల గర్భంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు నెలలో మౌనికు జన్మనివ్వబోతుండగా.. ఈ జంట చాలా హాయిగా గడుపుతోంది. చూడాలి మరి వీరికి ఎవరు పుట్టాబోతున్నారనేది.


Click it and Unblock the Notifications











