పూరి జగన్నాథ్, మణిశర్మ 'పోకిరి'ని మించేలా ప్లాన్!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఫస్ట్ లుక్ తోనే ఈ చిత్రంపై ఆసక్తిని పెంచారు. రామ్ రఫ్ లుక్ లో అదరగొడుతున్నాడు. మాస్ కథలని కూడా స్టైలిష్ గా ప్రజెంట్ చేయడంలో పూరిదిట్ట. రామ్, పూరి కలయికలో వస్తున్న తొలి చిత్రం ఇది. ఈ చిత్రంలో రామ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఇష్మార్ట్ శంకర్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ చిత్రం గురించి తాజాగా ఆసక్తికర ప్రచారం మొదలైంది. పూరి జగన్నాథ్ కు ఇటీవల సరైన హిట్ లేదు. దీనితో పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో అన్ని అంశాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నాడట. ఇష్మార్ట్ శంకర్ చిత్రానికి సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నాడు. కాగా పూరి జగన్నాథ్, మణిశర్మ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి చిత్రంలో ముమైత్ ఖాన్ ఐటెం సాంగ్ కేక పెట్టించింది. దానిని మించేలా ఇస్మార్ట్ శంకర్ లో క్రేజీ సాంగ్ లో పూరి, మణిశర్మ ప్లాన్ చేస్తున్నారట.

ఇప్పటికే ఈ సాంగ్ కు అదిరిపోయే ట్యూన్ ని మణిశర్మ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన గమ్మత్తైన స్టెప్పులతో అదరగొడుతూ పాపులర్ అవుతున్న ఐటెం బ్యూటీ నోరా పథేహిని ఈ సాంగ్ కోసం పూరి రంగంలోకి దించుతున్నాడట. పూరి జగన్నాథ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











