‘మాయ’ చేసిన పూరి జగన్నాథ్.. యువ హీరోకు ఆశీర్వాదం!

అజ‌య్ క‌తువార్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న సినిమా మాయం. ఇషితా షా క‌థానాయిక‌. జైయశ్రీ రాచ‌కొండ‌, ల‌క్ష్మి హుసేన్‌, సందీప్ బోరెడ్డి తారాగ‌ణం. నిషాంత్ ద‌ర్శ‌కుడు. ధీమాహి ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై డి.ఏ.రాజు ఈ చిత్రాన్న నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లో ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ మాయం ట్రైలర్ ని ఆవిష్క‌రించి న‌వ‌త‌రం క‌థానాయ‌కుడు అజ‌య్ క‌తువార్‌ని ఆశీర్వ‌దించారు. వివరాల్లోకి వెళితే..

మెహబూబాతో కెరీర్ ఆరంభం

మెహబూబాతో కెరీర్ ఆరంభం

మెహ‌బూబా చిత్రంతో న‌టుడిగా కెరీర్ ప్రారంభించిన అజ‌య్ హీరోగానూ పెద్ద స్థాయికి ఎద‌గాల‌ని ఆకాంక్షిస్తున్నాను. న‌వ‌త‌రంలో బోలెడంత ప్ర‌తిభ దాగి ఉంది. అజ‌య్ హీరోగా నిరూపించ‌కునేందుకు చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడు. మాయం చిత్రాన్ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్యాష‌నేట్ గా తెర‌కెక్కిస్తున్నార‌నిపిస్తోంది. టీమ్‌కు ఆల్ ది బెస్ట్ అని ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ అన్నారు.

పూరి సార్ ప్రోత్సాహంతో

పూరి సార్ ప్రోత్సాహంతో

పూరి స‌ర్ ప్రోత్సాహంతో మెహ‌బూబా చిత్రంలో న‌టించాను. తొలి ప్ర‌య‌త్న‌మే అంత పెద్ద ద‌ర్శ‌కుడి స‌పోర్టు ద‌క్క‌డం ఆనందంగా ఉంది. నేను హీరోగా న‌టిస్తున్న `మాయం` టైటిల్‌ని ఆవిష్క‌రించి ఆశీస్సులు అందించారు. ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు. ఇంత‌కుముందు హాలీవుడ్‌లోనూ న‌టించిన అనుభ‌వం ఉంది అని హీరో అజ‌య్ క‌తువార్ తెలిపారు.

మూడేళ్ల క్రితం నటించిన చిత్రం

మూడేళ్ల క్రితం నటించిన చిత్రం

మూడేళ్ల క్రిత‌మే నేను న‌టించిన `ది ఇండియ‌న్ పోస్ట్‌మేన్` 8 దేశాల్లో వివిధ సినిమా పండ‌గ‌ల్లో ప్ర‌ద‌ర్శ‌న‌కు పంపించాం. మూడు దేశాల్లో నామినేట్ అయ్యింది. అలాగే `స్పైసెస్ ఆఫ్ లిబ‌ర్టీ` అనే చిత్రం అమెరికాలో థియేట్రిక‌ల్ రిలీజ్ అయ్యింది. ఆ త‌ర్వాత `మెహ‌బాబూ` చిత్రంలో న‌టించాను. ప్ర‌స్తుతం మాయం రిలీజ్‌కి రెడీ అవుతోంది. నేను న‌టించిన `ప్రేమ‌దేశం` త్వ‌ర‌లో రిలీజ్‌కి వ‌స్తోంది అని హీరో అజ‌య్ క‌తువార్ అన్నారు

 పూరీ చేతుల మీదుగా ట్రైలర్

పూరీ చేతుల మీదుగా ట్రైలర్

మాయం సినిమా గ్రేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేయటం ఆనందం గా ఉంది ఆయన ఎపుడు కొత్త టాలెంట్ ని ఎపుడు ఎంకరేజ్ చేస్తారు . ఇది ఒక డిఫరెంట్ మూవీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయింది. రిలీజ్ కి రెడి గా ఉంది అని నిషాంత్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X