మెగా ట్యాగ్ వాడుకోవద్దు.. అల్లు అర్జున్‌పై చిరంజీవి కామెంట్స్
తెలుగు సినిమా పరిశ్రమలో మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు అత్యంత చర్చనీయాంశమైన అంశంగా మారింది. అయితే సోషల్ మీడియాలో అభిమానులు ఒకరిపై మరొకరు వాగ్బాణాలు సంధించుకొంటూ పోస్టులు ద్వారా వివాదాన్ని రేకెత్తించారు. అయితే ఈ వ్యవహారంలో మెగా హీరోలు, అల్లు అర్జున్ పరోక్ష వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. అయితే అల్లు అర్జున్ వ్యవహారంపై చిరంజీవి సమోచితంగా స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ వీడియో చిరంజీవి చెప్పిన విషయాలు, అలాగే అల్లు, మెగా కుటుంబాల మధ్య విభేదాలకు కారణమైన అంశాల్లో గురించి వివరా్లలోకి వెళితే..
పుష్ప 2 మూవీ రిలీజ్‌కు ఎదురు దెబ్బ.. ఆ దేశంలో షాకిచ్చిన కల్కి వివాదంగత కొద్దికాలంగా పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ మధ్య స్వల్ప విభేదాలు చోటు చేసుకొన్నాయి. కొన్ని సభల్లో పవన్ కల్యాణ్ గురించి చెప్పమంటే.. నేను చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ కామెంట్ చేయడం తెలిసిందే. అయితే అప్పటి నుంచి మెగా క్యాంపుకు స్టైలిష్ స్టార్ దూరంగా ఉంటూ వస్తున్నారు. అలా మెగా ట్యాగ్‌ను వాడుకోకుండా దూరంగా ఉంటూ వస్తున్నారు.

అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు తెలియచేయడానికి వెళ్లడంతో వారి కుటుంబాల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. దాంతో మెగా హీరోలు డైరెక్టుగానే అల్లు అర్జున్ తీరుపై స్పందించారు. అవసరమైతే పరోక్షంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. దాంతో ఇరు కుటుంబాల మధ్య అంతరం ఏర్పడిందనే విషయం స్పస్టమైంది.
అయితే ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నాకు ఫ్యాన్స్ ఎవరూ లేరు. నా ఆర్మీని చూసే నేను యాక్టర్ అయ్యాను. నాకు నా ఆర్మీ అంటే చాలా ఇష్టం.. చాలా ఇష్టం అంటూ కామెంట్ చేశాడు. నాకు నచ్చితే ఎక్కడికైనా వెళతా.. ఎవరితోనైనా కలుస్తా అనే విధంగా మాట్లాడాడు. దాంతో వారి మధ్య అభిప్రాయబేధాలు ఉన్నట్టు స్పష్టమయ్యాయి.

ఇదిలా ఉండగా, ఇటీవల మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. నేను నా పెదన్నాన్న, బాబాయ్ గురించి మాట్లాడుతుంటూనే ఉంటాను. అయితే మనం ఎక్కడ నుంచి వచ్చాం. ఎవరి సపోర్టుతో ఎదిగాం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అలా చేయకపోతే నీవు ఎంత సక్సెస్ సాధించినా దానికి విలువ ఉండదని వరుణ్ తేజ్ కామెంట్ చేశారు.
అయితే భోళా శంకర్ ప్రమోషన్స్‌లో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఎవరికి వారు సొంతంగా ఎదగాలి. ఎప్పుడూ మా నాన్న, మా తాత అని ఈవెంట్స్‌లో మాట్లాడుతుంటే నాకు నచ్చదు. ఎవరికి వారు తమ ఇమేజ్‌ను పెంచుకోవాలి. మెగా ఇమేజ్ నుంచి బయటపడితే అంతకంటే నాకు ఆనందం ఏముంటుంది. అల్లు అర్జున్ కూడా అలా సొంతంగా ఎదిగితే నాకు హ్యాపీ అని చిరంజీవి అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











