గుంటూరు కారంలో చిరంజీవి రిఫరెన్స్.. మెగాస్టార్ డైలాగ్ కొట్టిన సూపర్ స్టార్.. మీరూ గుర్తించారా?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా గుంటూరు కారం గురించి అందరికీ తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు అంటే జనవరి 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టుకుంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సినిమాపై ఎక్కువ మంది పాజిటివ్ కామెంట్లు చేస్తుండగా.. కొందరు మాత్రం నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా బాక్సాఫీసు షేక్ చేస్తున్న ఈ సినిమా కచ్చితంగా సూపర్ డూపర్ హిట్టు కొడుతుందని అంతా అంటున్నారు.
అతడు, ఖలేజా వంటి బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత వీరిద్దరి కాంబోలో దాదాపు 13 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. అలాగే టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ క్యూట్ బ్యూటీ శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగా చేశారు. అలాగే, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ, రావు రమేష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు.
Recommended Video


అంచనాలకు తగ్గట్లుగానే అందరినీ తెగ అలరిస్తున్న ఈ సినిమా గురించి నెట్టింట పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఎవరికి నచ్చిన పాయింట్లను వారు చెబుతున్నారు. కొందరు సినిమా చాలా బాగుందని అంటుండగా.. మరికొందరేమో గురూజీ మార్క్ కనిపించలేదని, శ్రీలీలీ డ్యాన్స్ కే పరిమితం అయిందని, సౌండ్ బాలేదంటూ చాలానే కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడుతుండగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా చూసిన మెగాస్టార్ చిరజీవి ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఎందుకో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మహేష్ బాబు గుంటూరు కారం సినిమా మెగాస్టార్ చిరంజీవి రిఫరెన్స్ ఉందని అంటున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ పేరుతో ఉన్న ఓ డైలాగ్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు కొట్టారని చెబుతున్నారు. "మనం చిరంజీవి టైప్ స్యయం కృషి" అంటూ సూపర్ స్టార్ వన్ లైన్ డైలాగ్ ఉంది. ఇది గుర్తించిన మెగా అభిమానులు తెగ ఎగ్జైట్ అవుతున్నారు. తమ అభిమాన హీరో పేరును సూపర్ స్టార్ పలకడంతో తెగ ఖుషీ అయిపోతున్నారు. అదే విషయాన్ని ట్విట్టర్ వేధికగా వెల్లడిస్తూ తెగ సందడి చేస్తున్నారు. మీరూ ఈ సినిమా కనుక చూసి ఉంటే ఆ డైలాగ్ ను మీరు కూడా గుర్తించారా లేదా అనేది చెప్పండి.


Click it and Unblock the Notifications











