Bhola Shankar: తమన్నా, సుశాంత్‌లకు హ్యాండ్ ఇచ్చిన చిరు.. అసలేం జరిగిందంటే?

మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య చిరు లీక్స్ అంటూ సినిమా విశేషాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిరు లీక్స్... ఆచార్య సినిమా నుంచి మొదలైంది. అయితే చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళాశంకర్. ఈ సినిమాకు సంబంధించిన లీక్స్ కూడా చిరు ఇచ్ఛేశాడు. అయితే తాజా ఓ షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఇందులో నటిస్తున్న తమన్నా, సుశాంత్ లను చిరు పిచ్చోళ్లను చేశాడని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...

OTT: ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన 'బాహుబలి ఫ్లేవర్' మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అప్పటినుంచి మొదలు: చిరు లీక్స్... ఆచార్య సినిమా నుంచి బాగా ఫేమస్ అయ్యాయి. ఇక బ్రహ్మాజీ కుమారుడు సంజీవ్ రావు నటించిన పిట్టకథ సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ.. అనుకోకుండా కొరటాల మూవీ టైటిల్ రివిల్ చేశాడు. ఇక అప్పటి నుంచి చిరు లీక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇక తాజాగా చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాకు సంబంధించిన విషయాలను చిరు లీక్స్ పేరిట మెగాస్టార్ రిలీజ్ చేస్తున్నాడు.

Megastar Chiranjeevi warns Tamannaah and Sushanth about Bhola Shankar Movie leaks news goes viral

కావాలనే లీక్స్: ఇక ఇప్పటివరకు చిరంజీవి చేసిన లీకులు స్క్రిప్ట్ ప్రకారమే చేస్తున్నారని అంతా అనుకుంటున్నారు. అయితే ఇదిలా ఉండగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. చిరంజీవి లీక్ చేసిన కంటెంట్ గురించి తమకు ఏ మాత్రం తెలియదని చిత్ర బృందం చెబుతోంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఇమిటేడ్ చేసే సీన్ చిరంజీవి కావాలనే లీక్ చేశారని తెలుస్తోంది. ఇక ఈ విషయం డైరక్టర్ మెహర్ రమేష్ కూడా తెలియని తెలుస్తోంది.

Megastar Chiranjeevi warns Tamannaah and Sushanth about Bhola Shankar Movie leaks news goes viral

తమన్నాను చెయొద్దంటూ: ఇక మూవీ ఎడిటర్ కు చెప్పి దగ్గరుండి చేయించుకుని చిరంజీవి స్వయంగా బయటకు వదిలేశారట. ఈ విషయాన్ని మెహర్ రమేశ్ చిత్ర ప్రమోషన్లలో చెప్పుకొచ్చాడు. అయితే తాజా విషయం ఏంటంటే.. తమన్నా, సుశాంత్ లను చిరంజీవి పిచ్చోళ్లలను చేసినట్లు తెలుస్తోంది. ఇక విదేశాల్లో ఉన్నప్పుడు తమన్నాకు తెలియకుండానే కొన్ని విజువల్స్ షూట్ చేయించి మరి లీక్ చేయించారని మిల్కీ బ్యూటీ తమన్నా వెల్లడించింది.

Megastar Chiranjeevi warns Tamannaah and Sushanth about Bhola Shankar Movie leaks news goes viral

సుశాంత్ కు వార్నింగ్: ఇక సుశాంత్... "జాం జాం జజ్జనక" సాంగ్ సెట్ బాగుందని సుశాంత్ కొన్ని ఫొటోలు తీసుకుంటే వ‌ద్దు అని చిరు చిన్న వార్నింగ్ ఇచ్చార‌ని తెలుస్తోంది. ఇవి సినిమాలో చాలా ఇంపార్టెంటు.. ఆ ఫోటోలు బయటకు రావొద్దు అని చెప్పి.. కొద్ది రోజులకే చిరు వాటిని.. లీక్స్ పేరిట రీలజ్ చేశారు. అలా చిరు లీక్స్ పేరిట సినిమాలు విషయాలు చిరంజీవి బయట పెట్టడం.. మొత్తానికి సినిమాపై ఇంట్రెస్ట్ పెంచే విధంగా ఉంటున్నాయి. ఒకరకంగా ఇది సినిమాకు ప్లస్ అనే చెప్పవచ్చు.

Megastar Chiranjeevi warns Tamannaah and Sushanth about Bhola Shankar Movie leaks news goes viral

ఇక ఈ చిత్ర విషయానికి వస్తే: చిరంజీవి హీరోగా నటిస్తుండగా.. ఆయన సరనస తమన్నా నటిస్తోంది. ఇక కీర్తి సురేష్ చిరుకు చెల్లెలుగా నటిస్తోంది. సుశాంత్ లవర్ బాయ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి స్టైలిష్ ఫిలిం మేకర్ మోహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించారు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఆగస్ట్‌ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X